కెన్యాలో ఉన్న కోడెల కుమారుడు..? ఆరోపణలన్నీ అవాస్తవమేనా?

కెన్యాలో ఉన్న కోడెల కుమారుడు..? ఆరోపణలన్నీ అవాస్తవమేనా?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం చుట్టూ అనేక ఆరోపణలు, అనుమానాలు ముసురుకుంటున్నాయి. వైసీపీ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా... కుమారుడి వేధింపుల వల్లే కోడెల చనిపోయారని వైసీపీలోని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు.

కోడెల మేనల్లుడు, వైసీపీ నేత కంచేటి సాయిరామ్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగానూ ఓ లేఖ ప్రచారంలో ఉంది. కోడెలను ఆస్తి కోసం కుమారుడు చాలా వేధించాడని.. అనేకసార్లు కోడెల తనకు ఫోన్ చేసి బాధపడేవారని.. దీంతో పలుమార్లు కొడుకును తాను మందలించానని కూడా సాయిరాం చెబుతున్నారు.  పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపేశారని.... కోడెల శివరామ్ తన తండ్రి కోడెల శివప్రసాద్‌ కొట్టడంతో ఆయన అవమానభారంతో ఉరేసుకున్నారని కూడా సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది.

అంతేకాదు.. కోడెల తనయుడు శివరామ్ కూడా ఇంతవరకు తండ్రి శవం వద్దకు రాలేదంటూ ప్రచారం జరుగుతోంది. అయితే.. శివరామ్ ప్రస్తుతం ఇండియాలో లేరని.. ఆయన కెన్యాలో ఉన్నారని తెలుస్తోంది. రెండు రోజుల కిందట అంటే సెప్టెంబరు 14న శివరామ్ కెన్యా వెళ్లినట్లు తెలుస్తోంది.

అనేక అనుమానాలు ముసురుకుంటున్న నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్టు కోసం అంతా చూస్తున్నారు. పోస్టు మార్టంలో ఏం తేలుతుంది.. మరణానికి కారణమేంటి అనేది ఇప్పుడు చర్చనీయంగా మారింది. అయితే, టీడీపీ నేతలు మాత్రం కోడెల ఉరివేసుకున్నారని చెబుతున్నారు. వైసీపీవేధింపులు, రాజకీయ కక్ష సాధింపులకు ఆయన బలైపోయారని ఆరోపిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English