కోడెల శివప్రసాద్: వంగవీటి రంగా హత్య నుంచి ఇంట్లో బాంబు పేలుళ్ల వరకు

కోడెల శివప్రసాద్: వంగవీటి రంగా హత్య నుంచి ఇంట్లో బాంబు పేలుళ్ల వరకు

మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరుస కేసుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. మొన్నటి ఎన్నికల తరువాత ఆయన, కుటుంబసభ్యులు కేసుల్లో చిక్కుకున్నారు. అయితే.. అంతకుముందు కూడా ఆయన జీవితంలో అనేక ఆరోపణలు, కేసులు ఉన్నాయి. వాటిలో మూడు కేసులు చాలా ముఖ్యమైనవి.

1) వంగవీటి రంగా హత్య

ఆంధ్రప్రదేశ్‌‌లో జరిగిన రాజకీయ హత్యల్లో వంగవీటి రంగా హత్య అత్యంత సంచలనమైంది. 1989 డిసెంబర్‌లో ఆ హత్య జరిగింది. ఆ సమయంలో హోం మంత్రిగా కోడెలే ఉన్నారు. రంగా హత్యే పెద్ద సంచలనమైతే.. ఆ తరువాత అల్లర్లలో ఎంతో మంది చనిపోవడం.. కాళ్లుచేతులు కోల్పోవడం, గృహదహనాలు వంటివి మరింతగా పరిస్థితులను దిగజార్చాయి. రాష్ట్రం అల్లకల్లోలమైపోయింది. దాంతో హోంమంత్రిగా ఆఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు కోడెల. టీడీపీలో ఓ వర్గం నేతల ప్రోద్బలంతో వంగవీటి రంగా హత్య జరిగిందని.. వారికి కోడెల అండగా ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి అప్పట్లో.

2) 1999.. ఇంట్లో బాంబులు పేలి నలుగురి మృతి

1999 ఎన్నికల సమయంలో కోడెల శివప్రసాద్ ఇంట్లో బాంబులు పేలి నలుగురు మరణించారు. ప్రత్యర్థులపై దాడుల కోసం కోడెల ఇంట్లో బాంబులు తయారు చేస్తుండగా అవి ప్రమాదవశాత్తు పేలాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఆయన మాత్రం ఖండిస్తూ వచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన దానిపై క్లారిటీ ఇచ్చారు. ‘‘ ఆ ఘటన జరిగినప్పుడు నేను ఎన్నిక ప్రచారంలో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొదిలిలో ఉన్నాను. పోలీసుల తనిఖీ ఎక్కువైందని ఎవరో ఒక వ్యక్తి బాం బులు తెచ్చి మా ఇంట్లో దాచాడు. తర్వాత వాటిని తీసుకెళ్లే ప్రయత్నంలో ఒకతను వాటిమీద కాలు వేయడంతో అవిపేలినలుగురు మరణించారు. అది నాకు చాలా బాధ కలిగిం చింది. తర్వాత దానిపై సీబీఐ విచారణ జరిగింది. కానీ నా ఇంట్లో అటువంటి ఘటన ఓ మచ్చగా మిగిలింది. కానీ, నేను తప్పు చేయనని ప్రజలు నమ్మారు. అందుకే నన్ను గెలిపించారు. నరసరావుపేటలో ఫ్యాక్షన్‌ గొడవలున్న గ్రామాలు చాలా ఉన్నాయి. ఒకసారి హోం మంత్రిగా ఉన్నపుడు రొంపిచర్లలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాను. అప్పుడే నామీద బాంబు దాడి జరిగింది. అంతమంది పోలీసు లున్నా ఎవరూ అడ్డుకోలేకపోయారు. అప్పుడు పరిస్థితులు అంత దారుణంగా ఉండేవి. కానీ 1994 తర్వాత చాలా మారింది’’ అని చెప్పారు కోడెల.

3) వరద బాధితులకు బియ్యం సేకరించి అమ్ముకున్నారన్న ఆరోపణ

తూర్పుగోదావరిలో తుఫాను వచ్చినప్పుడు బాధితులకోసం బియ్యం సేకరించి వాటిని అమ్ముకున్నారన్నది కూడా కోడెలపై వచ్చిన ఆరోపణల్లో ఒకటి. అయితే.. ఆయన మాత్రం సేకరించిన బియ్యాన్ని ఆర్డీవోకే అప్పగించేందుకు తూకం వేస్తుంటే నేను అమ్ముకోవడానికి తూకం వేయిస్తున్నానని ఆరోపించారని.. అవన్నీ తప్పుడు ఆరోపణలని కోడెల పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English