కోడెల మరణం... వైసీపీలో గప్ చుప్

కోడెల మరణం... వైసీపీలో గప్ చుప్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు హ‌ఠాన్మ‌ర‌ణం.. ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌లనం సృష్టించింది. ఎంతో మందికి ధైర్యం చెప్పి, ఎంతోమంది జీవితాల్లో వెలుగు లు పూయించిన కోడెల.. ఇప్పుడు ఇలా నిర్జీవంగా త‌న‌ను తాను ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం పై స‌ర్వ‌త్రా విస్మ యం వ్య‌క్తం అవుతోంది.

పార్టీల నాయ‌కులు.. పార్టీల‌కు అతీతంగా కోడెల మృతిపై దిగ్బ్రాంతి వ్య‌క్తం చేస్తు న్నారు. అనేక మంది ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా స‌హా ప్ర‌ధాన మీడియా ద్వారా త‌మసంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే, ఏపీ అధికార పార్టీ వైసీపీ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు కోడెల విష‌యంలో ఒక్క మాట కూడా స్పందించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను విమ‌ర్శించిన వారు స‌రే.. మిగిలిన వారు, ఆయ‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన వారు.. కూడా ఇప్పుడు మౌనం పాటించ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీస్తోంది.

సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కే కోడెల మృతి వార్త దావాల‌నంలాగా రాష్ట్ర మంత‌టా వ్యాపించింది. ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నా.. లేక గుండెపోటుకు గుర‌య్యారా? అనే స‌మాచారం ఇప్ప‌టికీ స‌స్పెన్స్‌గానే ఉంది. పోస్టు మార్ట‌మ్ రిపొర్టు వ‌స్తేనే త‌ప్ప ఏమీ చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని పోలీసులు చెప్పారు.

మ‌రి ఇంత సంచ‌ల‌నం సృష్టించిన మాజీ స్పీక‌ర్ ఉదంతంపై  వైసీపీ పార్టీ నాయ‌కులు కానీ మంత్రులు కానీ, కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న‌వారు కానీ ఎక్క‌డా స్పందించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కోడెల‌ను టార్గెట్ చేశార‌నే ప్ర‌చారంలో ఉన్న వైసీపీ నాయ‌కులపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉందని టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే తాము ఏం మాట్లాడినా కూడా ప్ర‌జ‌ల్లోకి స‌రైన సంకేతాలు వెళ్లే అవ‌కాశం లేద‌ని భావించిన వైసీపీ.. ఇప్పుడు ఇంత జ‌రుగుతున్నా మౌనంగా ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కార్యాల‌యం నుంచి మాత్రం సంతాప ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. కోడెల మృతికి సంతాపం తెలిపిన సీఎం.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English