బాబు కంటే పవన్ కు ఎక్కువ రియాక్టవుతున్న వైసీపీ

బాబు కంటే పవన్ కు ఎక్కువ రియాక్టవుతున్న వైసీపీ

మూడు టెర్ముల సీఎం. పలుమార్లు ప్రతిపక్ష పాత్ర. అన్ని విషయాలపై రాజకీయ, సామాజిక అవగాహన ఉన్న వ్యక్తి.... ఇప్పటికీ ప్రతిపక్ష నేత చంద్రబాబు.  అలాంటి నేత చేసిన విమర్శల కంటే తానే స్వంతంగా గెలవలేని, కేవలం ఒకే ఒక్క సీటు గెలిచిన జనసేన పార్టీకి అధినేత పవన్ కళ్యాణ్  విమర్శలకే వైసీపీ ఎక్కువ ఉలిక్కిపడుతోంది. ఇది రాజకీయ విశ్లేషకులను ఆకట్టుకుటోంది.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పవన్ వంద రోజులు ప్రభుత్వంపై ఏ విమర్శలు చేయను అని మాటిచ్చారు. ఆ మాటపై నిలబడ్డారు. మధ్యలో ఇసుక గురించి మాట్లాడారు గాని ప్రభుత్వంపై విమర్శలు ఏమీ పెద్దగా చేయలేదు. సరిగ్గా వంద రోజులు అయ్యాక పవన్ కళ్యాణ్ జగన్ పాలనపై జనసేన టీం తయారుచేసిన ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. దాదాపు ప్రతి అంశాన్ని టచ్ చేస్తు తయారుచేసిన ఆ నివేదికను పవన్ స్వయంగా విడుదల చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆకతాయిగా పాలన సాగిస్తున్నారని చేసిన కామెంట్ వైరల్ అయ్యింది.

వైసీపీ - టీడీపీ మధ్య విమర్శల హోరు కొనసాగుతున్నా... అది సాధారణమైపోయింది. కొన్ని సార్లు వైసీపీ టీడీపీ విమర్శలను చాలా లైట్ తీసుకుంటోంది. అయితే, పది శాతం ఓట్లను కూడా సాధించలేని పవన్ విషయంలో వైసీపీ నుంచి ఊహించని స్పందన వస్తోంది. చంద్రబాబు పాలనపై ఎందుకు విమర్శలు చేయరు, ఆయన పాలనలో తప్పులు లేవా వింటి విమర్శలు చేశారు వైసీపీ నేతలు రోజా రెడ్డి, అంబటి రాంబాబు తదితరులు. విజయసాయిరెడ్డి కూడా పవన్ విమర్శలపై గట్టిగానే స్పందించారు.

వైసీపీ విమర్శల్లో తీవ్రత కంటే... ఉలిక్కిపాటే ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి కారణం... పవన్ ఫ్యాన్స్  ఎపుడూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నా పవన్ నెత్తికెత్తుకునే సమస్యలు మాత్రం బాగా జనాల్లో నలిగినవే అయి ఉంటున్నారు. చాలా వాటిపై పవన్ స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ విమర్శలు వైసీపీనీ కలవరానికి గురిచేస్తున్నాయి.

మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇదే కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా సక్సెస్ అవకపోయినా... బాధ్యతాయుతంగా నిజాయితీగా సమస్యలపై స్పందిస్తారన్న టాక్ జనాల్లో ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. అప్పటికే అన్ని విషయాలపై టీడీపీ స్పందిస్తూ ఉండటం... వాటిలో ప్రధాన మైన వాటిని పవన్ సెలెక్ట్ చేసుకుకున్నపుడు అదిజనాల్లో మరింత చర్చకు దారితీయడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతామని వైసీపీ భావిస్తుందేమో. ఏదైనా... పవన్ విధానం తాత్కాలికంగా ెపెద్దగా లాభించకపోయినా... దీర్ఘకాలంలో అతనికి ఓ ముద్రను తెచ్చిపెడుతుంది.

దీనికి మరో కారణం కూడా ఉండొచ్చు... టీడీపీ అభిమానులతో పోలిస్తే పవన్ అభిమానులు వైసీపీ అభిమానుల్లాగే ఎంతకయినా తెగించే రకం. అందుకే పవన్ విమర్శలు తమను ఆన్ లైన్, ఆఫ్ లైన్లో ఎక్కువ డ్యామేజ్ చేస్తాయని వైసీపీ ఆలోచిస్తుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English