రాజకీయాల్లోకి రీఎంట్రీ.. తెలంగాణకు ఎందుకు వస్తున్నట్లు?

రాజకీయాల్లోకి రీఎంట్రీ.. తెలంగాణకు ఎందుకు వస్తున్నట్లు?

సాధారణంగా రాజ్యాంగ పదవుల్ని చేపట్టిన వారు.. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వటం చాలా తక్కువగా జరుగుతుంటుంది. అందునా గవర్నర్ లాంటి పదవుల్ని నిర్వహించిన నేతలు.. రెగ్యులర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఇష్టపడరు. అప్పటివరకూ ఎంతో ఉన్నత పదవిలో ఉండటం.. అందరి గౌరవాభిమానాలు పొందిన వారు.. రెగ్యులర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాటి నుంచి అవమానాలు.. ఛీత్కారాలు.. ఆరోపణలు.. అభియోగాలు ఇలా చాలానే ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అప్పటివరకూ పొందిన గౌరవ మర్యాదలన్ని మాయమవుతాయి. అందుకే.. ఉన్నత పదవుల్ని చేపట్టిన తర్వాత.. రెగ్యులర్ రాజకీయాల వైపు వచ్చేందుకు ఒప్పుకోరు.
అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ ప్రాంతానికి చెందిన సీహెచ్ విద్యాసాగర్ రావు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన.. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు.

కేసీఆర్ కు సన్నిహితుడు కావటమే కాదు.. మహారాష్ట్ర గవర్నర్ గా నియమించిన సమయంలో.. తెలంగాణ ప్రభుత్వం తరఫున పౌరసన్మాన భాగ్యం ఆయనకు దక్కింది. అలాంటి విద్యాసాగర్ రావు ఈ రోజు బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని హైదరాబాద్ లో తీసుకోనున్నారు. దీంతో.. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు మళ్లీ తెర లేపారని చెప్పాలి.

ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అధినాయకత్వం.. వ్యూహాత్మకంగానే విద్యాసాగర్ రావును తెర మీదకు తీసుకు వస్తుందని చెబుతున్నారు. ఈ కారణం చేతనే.. మహారాష్ట్ర గవర్నర్ పదవీ కాలం పూర్తి అయ్యాక.. మరో రాష్ట్రానికి గవర్నర్ ను చేయకుండా తెలంగాణకు తీసుకురావటం వెనుక పక్కా వ్యూహం ఉందంటున్నారు.

కేసీఆర్ ను ఎదుర్కునేందుకు అవసరమైన వ్యూహాలు.. శక్తిసామర్థ్యాలతోపాటు.. బలమైన సామాజిక వర్గం అండ కూడా ఆయనకు లాభిస్తుందంటున్నారు. లేటు వయసులో ఘాటు ప్రేమ తరహాలో.. గవర్నర్ లాంటి అత్యుత్తమ పదవిని చేపట్టిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ వస్తున్న ఆయన్ను కేసీఆర్ అండ్ కో ఎలా ట్రీట్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా చెప్పక తప్పదు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English