'పవన్ కాపోడే.. కాపోళ్ల పట్టుదల ఆయనలో ఉంది'

'పవన్ కాపోడే.. కాపోళ్ల పట్టుదల ఆయనలో ఉంది'

ముఖ్యమంత్రి జగన్ కు భయపడి కాపు నేతలు వైసీపీలోకి చేరుతున్నారన్న పవన్ శ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తోట త్రిమూర్తులు వైసీపీలో చేరిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి తోట త్రిమూర్తులు మామాలుగా స్పందించారు. ఆయనకు భయపడి కాదని... ఆయన పాలన నచ్చి పార్టీలో చేరుతున్నామని త్రిమూర్తులు అన్నారు. అయితే, దీనిపై మరో కాపు నేత ఆమంచి కృష్ణమోహన్ విచిత్రంగా స్పందించారు.

పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడటం దుర్మార్గం. పవన్ తనను తాను అవమానించుకున్నారు. ఎందుకంటే...  ఆయన కూడా మా కాపు సామాజికవర్గానికి చెందిన నేత. భయపడకపోవడం, ఎదురొడ్డి పోరాడడం మా కాపుల నైజం. అలాంటి కాపులు భయపడటం ఏంటి? తోట త్రిమూర్తులు కాపు కాబట్టి... ఆ లక్షణాలే కాపు అయిన పవన్ కళ్యాణ్ లో కూడా ఉంటాయి కదా.  పిరికితనంతో పార్టీ మారామని ఆయన అంటే.. పవన్ కళ్యాన్ కూడా పిరికివాడు అయినట్టే కదా'' అంటూ విచిత్రమైన లాజిక్ చెప్పారు.

ఆమంచి లాజిక్ పై జనసైనికులు కొందరు సెటైర్లు పేలుస్తున్నారు. కొందరు ఆగ్రహిస్తున్నారు. ఇదేం పిచ్చి లాజిక్... మనిషిని బట్టి లక్షణాలుంటాయి గాని కులం బట్టి లక్షణాలుంటాయా? పవన్ వ్యక్తిని అవమానిస్తే, ఆమంచి కులం ఆపాదించడమేంటని స్పందిస్తుందన్నారు. మొత్తానికి పవన్ పై కుల ముద్ర వేయడానికి ఆమంచి విశ్వప్రయత్నం చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English