బోటు ప్రమాదంపై మీడియా ముందే వార్నింగ్ ఇచ్చినా

బోటు ప్రమాదంపై మీడియా ముందే వార్నింగ్ ఇచ్చినా

"రెండు నెలలుగా గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయి లో వరద ప్రవాహం నదీ తీర గ్రామాలను ముంచెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో  పర్యాటకుల ప్రాణాలతో ప్రైవేట్‌ బోట్‌ల యాజమాన్యాలు దేవీపట్నం గోదావరిపై  విహారయాత్రలకు బోట్‌లను తిప్పుతున్నారు.

ఈబోట్‌లు పోశమ్మగండి నుంచి పేరంటాలపల్లి వరకు పాపికొండల విహారానికి ప్రమాదకర పరిస్థితుల నడుమ బోట్లు వెడుతున్నాయి. శనివారం ఒక బోట్‌లో 50 మంది పర్యాటకులు నదీ విహారా నికి వెళ్లారు. అధికారులు చోద్యం చూస్తూ ఆ బోట్‌ను నిలుపుదల చేసే ప్రయత్నం కూడా చెయ్యలేదు.

గోదావరి వరదల నేపథ్యంలో దేవీపట్నం మండలంలో ఇంకా 36 గ్రామాలు జలదిగ్భంధనంలోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో పాపి కొండల విహారానికి బోట్‌లను నడపడం పర్యాటకుల ప్రాణాలను పణంగా పెట్టడమే."

ఇది ఆంధ్రజ్యోతిలో నిన్న ప్రచురితమైన కథనం. కొన్ని రోజుల్లోగా ఏపీలో తమపై బ్యాన్ ఉందంటూ... ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రచారం చేస్తుండట వల్ల గాని, లేకపోతే... అది యాంటీ జగన్ పత్రిక అని గాని కారణం ఏదైనా ఈ వార్తను అధికారులు పట్టించుకోలేదు.

వరుసగా 50 మందికిపై ప్రయాణికులతో బోటు నిన్న కూడా వెళ్లింది. అదృష్టవశాత్తూ వారికి కాలేదు. కానీ తాజాగా అచ్చం ఆ పత్రికలో చెప్పినట్టే ప్రమాదం జరిగిపోయింది. ఈరోజు 61 మందితో వెళ్లిన రాయల వశిష్ట బోటు ప్రమాదానికి గురై 12 మంది మరణించారు, 30 మందికపై పైగా గల్లంతయ్యారు. సహాయక చర్యలు సాగుతున్నాయి.

పంచభూతాలను కంట్రోల్ చేయడం ఏ ప్రభుత్వాల వల్ల కాదు. అందుకే ప్రమాదాన్ని నివారించడంపై దృష్టిపెట్టాలి. మరి అధికారులు ఎందుకు తెలిసీ తెలిసీ నిర్లక్ష్యం వహించారని అందరూ ప్రశ్నిస్తున్నారు. వరద ముప్పు తెలుసు, గోదావరి ఉదృతి తెలుసు. కనీసం మీడియాలో వార్తలు వచ్చినపుడు స్పందించినా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని  అందరూ వాపోతున్నారు.

ఆ పత్రికలో ప్రచురితమైన డేంజర్ వార్నింగ్ క్లిప్పింగ్ ఇపుడు సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. ఈ మీడియా కథనాన్ని పక్కన పెట్టినా... గత అనుభవాలు తెలిసి అయినా అధికారులు ఈ బోటులను ఆపాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English