దుక్కలా ఉన్నా... మళ్లీ నేనే సీఎం - కేసీఆర్

దుక్కలా ఉన్నా... మళ్లీ నేనే సీఎం - కేసీఆర్

ఈరోజు కేసీఆర్ ఆసక్తికరమైన రాజకీయ వ్యాఖ్యలు చేశారు. చాలాకాలంగా కేసీఆర్ ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా స్పందిస్తూ... ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టారు.

తనకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని జనాలకు స్వయంగా తెలియజెప్పడం ద్వారా ఆ గాసిప్ లకు ముగింపు పలకడం ఒకటైతే, కేటీఆర్ ఇప్పట్లో సీఎం పదవిపై ఆశలు పెట్టుకోకూడదు అన్న విషయాన్ని స్వయంగా క్లారిఫై చేయడం మరోటి.

ఇంతకీ కేసీఆర్ అసెంబ్లీలో ఏమన్నారో స్వయంగా ఆయన మాటల్లో. "అధ్యక్షా గత 20 ఏళ్ల నుంచి చూస్తున్నాను. కేసీఆర్ చస్తూనే ఉన్నాడు. నా ఆరోగ్యానికి ఏదో అయిపోయిందని, అమెరికాకు పోయి ట్రీట్ మెంట్ తీసుకుంటాడని ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇదంత తప్పుడు ప్రచారం. నేను దుక్కలా ఉన్నాను. ప్రజల కోసం తిప్పలు పడుతున్నాను. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మంచి పనులు చేస్తోంది, చేస్తూనే ఉంటుంది. అందుకే గరిష్టంగా ఇంకో మూడుసార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది. 2018 లో గెలిపించారు. 2024, 2029లో కూడా గెలిపిస్తారు. ఈ టెర్మూ, ఇంకో టెర్మూ నేనే ముఖ్యమంత్రిని అవుతాను. ఇంకో పదేళ్లు బ్రహ్మాండంగా పనిచేయగలిని శక్తి నా ఒంట్లో ఉంది" అని వ్యాఖ్యానించారు.  

2029 తర్వాత కేటీఆర్ కు అవకాశం ఉంటుందని నేరుగా చెప్పేశారు. ఇది కేసీఆర్ అభిమానులకు ఇంపుగా ఉంటుంది గానీ... కేటీ రామారావు అభిమానులకు ఓ చిన్న ఝలక్. అయితే సాధారణ జనం అభిప్రాయం మాత్రం తండ్రి అధికారంలో ఉంటే ఏంటి, కొడుకు అధికారంలో ఉంటే ఏంటి... అనుకుని ఉండొచ్చు గాని కేటీఆర్ కి త్వరలో పట్టాభిషేకం అనే గాసిప్ లు పలుమార్లు చక్కర్లు కొట్టాయి.

బహుశా ఇక వాటికి స్థానం ఉండదు. ఇదే క్రమంలో తన తదనంతరం సీఎం కుర్చీ టీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ కే దక్కుతుందన్న విషయాన్ని కూడా బహిరంగంగా బద్దలు కొట్టారు కేసీఆర్.  దీంతో హరీష్ బలాబలాలతో సంబంధం లేకుండా టీఆర్ఎస్ లో ఉంటే ఎప్పటికైనా మంత్రిగా మిగిలిపోవాల్సిందే అన్న క్లారిటీ కూడా ఇచ్చేసినట్లయ్యింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English