దేవరకొండ పిలుపు కు ప్రభుత్వం లో కదలిక

దేవరకొండ పిలుపు కు ప్రభుత్వం లో కదలిక

హీరోలు సొసైటీ లోంచే పుడతారు. ఆ సొసైటీ కోసం నిలబడి న వారే నిజమైన హీరోలు అవుతారు. నల్లమల ప్రకృతి ఇచ్చిన వరం. అభివృద్ధి పేరిట జరుగుతున్న పర్యావరణ నాశనం మానవ జాతి కి ముప్పు గా మారింది.ఈ విషయం పై తెలుగు సినీ పరిశ్రమలో విజయ్ దేవరకొండ స్పందన సూటి గా చాలామంది ని తాకింది.

యురేనియం కొనగలం అడవులను కొనగలమా...? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించిన విజయ్ కి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుండి సమాధానం దొరికింది. నల్లమలలో ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని. అక్కడ యురేనియం ఉన్నా కూడా తవ్వకాలు జరగనివ్వం అని మినిస్టర్ కె టి ఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

నల్లమల లో యురేనియం తవ్వకాలకు  కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలకు విజయ్ దేవరకొండ గొంతు బలం గా మారింది. ఈ నిరసన లో పాల్గొన్న విజయ్ దేవరకొండ యూత్ కి ఒక రోల్ మోడల్ గా నిలిచాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English