ప‌వ‌న్ ఫోన్ చేయ‌డం.. రేవంత్ వెళ్ల‌డమా..!

ప‌వ‌న్ ఫోన్ చేయ‌డం.. రేవంత్ వెళ్ల‌డమా..!

పాపం ప‌వ‌న్‌.. ఆయ‌న పాట్లు అన్నీఇన్నీకావు మ‌రి. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కోలుకోలేని దెబ్బ‌తిన్న ప‌వ‌న్ ఇప్పుడు ఉనికిపోరు చేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు జ‌నంలోని వ‌చ్చిన జ‌న‌సేన అధినేత‌ను జ‌నం ఆద‌రించ‌లేదు. పోటీ చేసిన రెండుచోట్లా ఓడించారు. డైలాగ్స్ మీద డైలాగ్స్ దంచికొట్టినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఒకానొక ద‌శ‌లో కింగ్‌మేక‌ర్ అవుతాన‌ని, అవ‌స‌ర‌మైతే సీఎం తానేన‌నే న‌మ్మ‌కంతో ఆయ‌న ఉన్నారు. కానీ.. అనుకున్న‌వ‌న్నీ త‌ల‌కిందుల‌య్యాయి. అయితే.. ఇప్పుడు ఏపీలో ప‌వ‌న్ ఏదో హ‌డావుడి చేస్తున్నా.. ఆయ‌న అంతేలే అన్న‌ట్టు చూస్తున్నారు జ‌నం. అయితే..ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న ప‌వ‌న్‌ సేవ్ న‌ల్ల‌మ‌ల నినాదంతో మ‌ళ్లీ జ‌నం ఆద‌ర‌ణ పొందాల‌ని చూస్తున్నారు.

న‌ల్ల‌మ‌ల అరణ్యంలో యురేనియం త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకంగా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు ఏకం అవుతున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత హ‌నుమంత‌రావు నేతృత్వంలో ఓ క‌మిటీ కూడా వేసింది. అయితే.. ఇటీవ‌ల హ‌నుమంత‌రావు కూడా స్వ‌యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను క‌లిసి సేవ్ న‌ల్ల‌మ‌ల పోరాటంలో క‌లిసి రావాల‌ని కోరారు. ఇక తాను కూడా స్వ‌యంగా పోరాటంలో పాల్గొనాల‌ని నిర్ణ‌యించుకున్న ప‌వ‌న్‌.. అందుక‌నుగుణంగా అడుగులు వేస్తున్నారు. అయితే.. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. మందిలో తానొక్క‌డిగా కాకుండా.. త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకునేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా.. తెలంగాణ కాంగ్రెస్ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి జనసేన అధినేత పవన్‌‌కళ్యాణ్‌ ఫోన్‌ చేశారు. యురేనియంపై కలిసిపోరాడదామని పవన్ కళ్యాణ్‌ కోరారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం ఉద‌యం 10 గంటలకు దస్పల్లా హోటల్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అఖిలపక్ష సమావేశానికి రావాల్సిందిగా రేవంత్‌ను పవన్ ఆహ్వానించారు. పవన్ ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశానికి హాజరుకానున్నారు.

అయితే.. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కోడంగ‌ల్‌లో ఓడిపోయిన రేవంత్‌రెడ్డి.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో త‌న స‌త్తాచాటారు. మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ స్థానంలో విజ‌యం సాధించి.. తానంటే ఏమిటో నిరూపించుకున్నారు. రేవంత్ ఇమేజ్ తోడైతే.. త‌న‌కు మ‌రింత ఆద‌ర‌ణ ఉంటుంద‌నే ఉద్దేశంతోనే ప‌వ‌న్ ఫోన్ చేశార‌నే టాక్ వినిపిస్తోంది. అయితే.. జ‌నంలో ఏమాత్రం ఇమేజ్ లేని ప‌వ‌న్ పిలిస్తే.. రేవంత్ వెళ్ల‌డం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English