అవును, పోలవరాన్ని వ్యతిరేకించాం- కేసీఆర్

అవును, పోలవరాన్ని వ్యతిరేకించాం- కేసీఆర్

ఏపీ ముఖ్యమంత్రి జగన్... కేసీఆర్ ఏపీని సస్యశ్యామలం చేయడానికి సహకారం అందిస్తాడు అని చెబుతుండగా...కేసీఆర్ మాత్రం, అవును తాము పోలవరం వ్యతిరేకించిన మనుషులమే అని సాక్ష్యాత్తూ అసెంబ్లీలో చెప్పారు.

ఏం జరిగిందంటే... కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు, ప్రభుత్వానికి మధ్య ప్రాజెక్టులతో పాటు అనేక విషయాల్లో వాగ్వాదం జరిగింది. పథకాలు నెరవేర్చలేదు. ఇల్లు కట్టలేదు. ప్రాజెక్టులు కట్టలేదు... ప్రతివిషయంలో మాట తప్పారు  అన్నట్టు భట్టి విక్రమార్క టీఆర్ఎస్ ప్రభుత్వంపై దండెత్తారు.

కేసీఆర్ దీనిపై స్పందిస్తూ... కళ్లు లేవా? పూర్తయిన ప్రాజెక్టులు మీకు కనిపించడం లేదా మీ పక్కనే ఉన్న భక్తరామదాసు ప్రాజెక్టు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కాదా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రస్తావన తెచ్చిన కేసీఆర్ ... ఇందిరాసాగర్ పేరుతో పోలవరం నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ ఆనాడు తలపెట్టింది. దానివల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది. మేము దానిని వ్యతిరేకించిన విషయం రికార్డుల్లో ఉంది... వెళ్లి చూసుకోండని కేసీఆర్ కాంగ్రెస్ నేతలకు సూచించారు. పోలవరాన్ని తాము పూర్తిగా వ్యతిరేకించినట్టు స్పష్టం చేశారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఇపుడు పోలవరానికి మద్దతు ఇస్తున్నారా లేదా అన్న విషయాన్ని మాత్రం కేసీఆర్ స్పష్టంచేయలేదు. కాకపోతే పోలవరం వ్యతిరేకించడం టీఆర్ఎస్ ప్రథమ ప్రాధాన్యం అన్నట్లు ఆయన మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఆ మధ్యన టీఆర్ఎస్ నేతలు పోలవరంపై కోర్టుల్లో వేసిన కేసులు ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English