రియాక్ట్ కాని విక్రమ్.. బ్యాడ్ న్యూస్ తప్పదా?

రియాక్ట్ కాని విక్రమ్.. బ్యాడ్ న్యూస్ తప్పదా?

కోట్లాది మంది ఎంతో ఆశగా చూస్తున్న విక్రమ్ ల్యాండర్ ఎంతకూ రియాక్ట్ కావట్లేదు. చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా.. చంద్రుడి ఉపరితలం మీదకు దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ ఆఖరి నిమిషాల్లో తేడా కొట్టొటం.. సంకేతాలు రాకపోవటం తెలిసిందే. దీంతో ప్రయోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్ ల్యాండర్ ఎంతకూ రియాక్ట్ కాని నేపథ్యంలో.. దీని సంగతి తేల్చేందుకు నాసా శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. డీప్ స్పేస్ యాంటెన్నాలతో ప్రయత్నించినా.. ల్యాండర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాని పరిస్థితి. దీంతో.. విక్రమ్ ల్యాండర్ మీద పెట్టుకున్న ఆశలన్ని వమ్ము అయినట్లుగా తెలుస్తోంది. గంటలు గడిచే కొద్దీ.. విక్రమ్ స్పందించే అవకాశం అంతంతకూ తగ్గిపోతున్న పరిస్థితి.

దీనికి కారణం ల్యాండర్ లో ఉన్న బ్యాటరీల పవర్ తగ్గిపోవటంగా చెబుతున్నారు. విక్రమ్ బ్యాటరీలు రీఛార్జ్ కావాలంటే సోలార్ పవర్ ను వినియోగించుకొని రీఛార్జ్ కావాలి. అందుకు తగ్గట్లుగా స్పందించాలంటే ఇస్రో పంపుతున్న సిగ్నల్స్ ను విక్రమ్ అందుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే విక్రమ్ ల్యాండర్ సిగ్నల్స్ ను వాడుకునే వీలుంది.

విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ ను రాబట్టేందుకు ఇస్రోలో ఉన్న టెలీమెట్రీ.. ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ టీం అనుక్షణం ప్రయత్నిస్తున్నా.. ఫలితం రావట్లేదు. వారం క్రితం విక్రమ్ ల్యాండర్ ఎలా అయితే.. దిగి ఉందో.. ఇప్పుడు అలానే ఉంది. ఎందుకంటే చంద్రుడి మీద గాలి లేకపోవటంతో.. పడిన చోట.. పడినట్లే ఉండిపోయింది.  టైం గడుస్తున్న కొద్దీ విక్రమ్ ల్యాండర్ మీద పెట్టుకున్న ఆశలన్ని సన్నగిల్లుతున్నాయి. అద్భుతం జరిగితే తప్పించి విక్రమ్ ల్యాండర్ రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉండదని చెబుతున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English