కేసీఆర్ అనుకొంద‌క‌టి... అయ్యిందొక‌టి..

కేసీఆర్ అనుకొంద‌క‌టి... అయ్యిందొక‌టి..

అనుకున్న‌దొక్క‌టి.. అయ్యిందొక్క‌టి.. అన్న‌చందంగా త‌యారైంది సీఎం కేసీఆర్ ప‌రిస్థితి. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ద్వారా పార్టీలోని అసంతృప్తుల‌ను మ‌చ్చిక చేసుకోవ‌చ్చ‌నుకున్న గులాబీ బాస్ వ్యూహం బెడిసికొట్టిన‌ట్లే క‌నిపిస్తోంది. ప‌ద‌వుల పందేరం అధికార పార్టీలో చిచ్చుపెట్టింది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌తోపాటు, విప్, చీఫ్‌విప్ ప‌ద‌వుల పంప‌కాలు అధినేతకు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ప‌ద‌వులు ద‌క్క‌ని సీనియ‌ర్ నేత‌లు అధిష్టానంపై తిగుబాటు చేస్తున్నారు. బ‌హిరంగంగా త‌మ అస‌మ్మ‌తి గ‌ళాల‌ను వి నిపిస్తున్నారు.

రాష్ట్ర మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌, మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎంతా టికొండ రాజ‌య్య బ‌హిరంగంగానే అధిష్టానంపై త‌మ అసంతృప్తిని వెల్ల‌గ‌క్కారు. ఆ త‌ర్వాత మ‌రో మాజీ మంత్రి జోగు రామ‌న్న మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌నే నిరాశ‌తో అజ్క్షాతంతోకి వెళ్లారు. వీరితోపాటు క‌డియం శ్రీహ‌రి, జూప‌ల్లి కృష్ణారావు, డీఎస్, రెడ్యానాయ‌క్‌, రేఖానాయ‌క్‌లాంటి నేత‌లు కూడా అల‌క‌బూనిన‌ట్లు స‌మాచారం. తాజాగా మంత్రి ప‌ద‌విపై ఆశ పెట్టుకుని భంగ‌ప‌డిన బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ ఒక అడుగు ముందుకేసి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌ను క‌ల‌వ‌డం టీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం రేపుతోంది.

ష‌కీల్ నేడో..రేపో బీజేపీలో చేర‌వ‌చ్చ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా క‌మ‌లం గూటికి చేరుతార‌నే వార్త‌లు గులాబీ శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈక్ర‌మంలోనే తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం టీబీజీకేఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చారు. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించారు. త్వ‌ర‌లోనే కేంద్ర మంత్రుల స‌మ‌క్షంలో ఆయ‌న బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్‌లో చేరునున్న‌ట్లు స‌మాచారం.

అయితే పార్టీలో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ఈ ప‌రిణామాల‌న్నింటిపై టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీ ఆర్ ప్ర‌త్యేకంగా దృష్టి సారించిన‌ట్లు స‌మాచారం. జిల్లాల వారీగా పార్టీ నేత‌ల క‌ద‌లిక‌లు, వారి మ‌నోగ‌తంపై ఆరా తీస్తున్న‌ట్లు తెలుస్తోంది. అస‌మ్మ‌తికి దారి తీస్తున్న ప‌రిణామాల‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంతేగాక అస‌మ్మ‌తి నేత‌ల‌ను బుజ్జ‌గించే ప‌నిని త‌న స‌న్నిహితుడైన పార్టీలోని ఓ కీల‌క నేత‌కు అప్ప‌గించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలానే కొన‌సాగితే ప‌రిస్థితి చేజారుతుంద‌ని, మొద‌ట్లోనే ఈ అంశానికి ముగింపు ప‌ల‌కాల‌ని కేసీఆర్ భావిస్తున్నుట్లు స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English