పీవీ సింధుకు జ‌గ‌న్ గిఫ్ట్ ఇచ్చేశారు..

పీవీ సింధుకు జ‌గ‌న్ గిఫ్ట్ ఇచ్చేశారు..

అంత‌ర్జాతీయ వేదిక‌పై స‌త్తా చాటుతూ ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ ఛాంపీయ‌న్‌గా నిలిచిన పీవీ సింధు విశాఖ‌ప‌ట్నంలో బ్యాట్మింట‌న్ అకాడ‌మి నెల‌కొల్ప‌నున్నార‌ట‌. అందుకు ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సింధు అకాడ‌మీకి 5 ఎక‌రాల స్థ‌లం ఇచ్చేందుకు అంగీక‌రించాడ‌ట‌.

ప్ర‌పంచ ఛాంపీయ‌న్‌గా గోల్డ్ మెడల్ కైవసం చేసుకుని భారత్ సత్తా చాటిన తెలుగుతేజం పీవీ సింధు తాజాగా సీఎం జ‌గ‌న్‌ను క‌లిసింది. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పీవీ సింధును సత్కరించారు. సింధును స‌త్క‌రించిన సీఎం జ‌గ‌న్ ఆమె త‌ల్లిదండ్రుల‌ను కూడా అభినందించారు.

తన తల్లిదండ్రులతో కలసి అమరావతిలోని సచివాలయానికి వచ్చిన పీవీ సింధు  సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సింధును శాలువా కప్పి సత్కరించిన జ‌గ‌న్ మెమెంటోనే అందజేశాడు. ఈ సంద‌ర్భంగా ఆమెకు అభినందలను తెలియజేశారు సీఎం జ‌గ‌న్‌.

భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.  ఏపీలో అన్ని క్రీడ‌ల‌కు ప్రాధాన్య‌త ఇచ్చే విష‌య‌మై జ‌గ‌న్ గ‌త కొంత కాలంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ భేటీలో సీఎంతో పలు అంశాలపై చర్చించిన పీవీ సింధు అనంతరం మీడియాతో మాట్లాడారు.

భావిత‌రాల‌కు బ్యాడ్మింట‌న్ లో మెలకువ‌లు నేర్పి జాతీయ స్థాయి క్రీడాకారుల‌ను త‌యారు చేసేందుకు వైజాగ్‌లో అకాడమీ నెలకొల్పేందుకు 5 ఎకరాల స్థలం కావాల‌ని సీఎం జ‌గ‌న్‌ను కోరాన‌ని ఆమె వెల్ల‌డించారు.

దీంతో ఐదెక‌రాల స్థలం ఇచ్చేందుకు సీఎం జ‌గ‌న్‌ అంగీకారం తెలిపార‌ని సింధు అన్నారు. ఏపీలో క్రీడాభివృద్ధికి అన్ని రకాలుగా సాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇక సీఎంతో జరిగిన  భేటీలో మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు పాల్గొన్నారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English