కేంద్ర మంత్రి.. బీకాంలో ఫిజిక్స్ మూమెంట్

కేంద్ర మంత్రి.. బీకాంలో ఫిజిక్స్ మూమెంట్

ఇది సోష‌ల్ మీడియా కాలం. ఏం మాట్లాడినా చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి. పెద్ద ప‌ద‌వుల్లో ఉన్న నాయ‌కులు నోరు జారితే అంతే సంగ‌తులు. నెటిజ‌న్లు ఆటాడేసుకుంటారు. ప‌రువు తీసి గంగ‌లో క‌లిపేస్తారు. కొన్నేళ్ల కింద‌ట తెలుగుదేశం ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్.. ఓ ఇంట‌ర్వ్యూలో తాను బీకాంలో ఫిజిక్స్ చ‌దివిన‌ట్లు చెప్పి ఎంత‌గా అబాసుపాల‌య్యారో తెలిసిందే.

ఇలా త‌మ అజ్ఞానాన్ని బ‌య‌ట‌పెట్టుకున్న నేత‌లు చాలామందే ఉన్నారు. తాజాగా ఆర్థిక‌మంత్రి నిర్మలా సీతారామ‌న్ సోష‌ల్ మీడియాలో కామెడీ పీస్‌గా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. జ‌నాలు ఉబెర్‌, ఓలాల్లో తిరుగుతుండటం వ‌ల్ల ఆటోమొబైల్ రంగం దెబ్బ తింద‌ని చెప్ప‌డం, రూపాయి ప‌త‌నానికి కూడా పొంత‌న లేని కార‌ణాలు చెప్ప‌డంతో ఎంత‌గా ట్రోల్ అవుతున్నారో తెలిసిందే.

ఇప్పుడు మ‌రో కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ సైతం విలేక‌రుల స‌మావేశంలో విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌బోయి బుక్ అయిపోయారు. తాజాగా ఒక ప్రెస్ మీట్లో భాగంగా ఎకాన‌మీకి సంబంధించిన లెక్క‌ల గురించి ఎక్కువ ఆలోచించొద్ద‌ని.. దాని గురించి ప్ర‌శ్న‌లు వ‌ద్ద‌ని అన్న పియూష్‌.. ఐన్‌స్టీన్ గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తిని క‌నిపెట్ట‌డానికి గ‌ణితం ఎంత‌మాత్రం ఉప‌యోగ‌ప‌డలేద‌ని అన్నాడు.

ఐతే మంత్రిగారికి నిజంగా అస‌లు విష‌యం తెలియ‌దా, లేక త‌డ‌బ‌డ్డాడో కానీ.. గురుత్వాక‌ర్ష‌ణ సిద్ధాంతాన్ని క‌నిపెట్టింది ఐన్‌స్టీన్ కాదు, న్యూట‌న్. దీంతో మంత్రి మాట్లాడుతున్న వీడియో పెట్టి సోష‌ల్ మీడియా జ‌నాలు ఆడేసుకుంటున్నారు. ఇది పియూష్ బీకాంలో ఫిజిక్స్ మూమెంట్ అంటూ మ‌న నెటిజ‌న్లు జోకులు పేలుస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English