ధోని అభిమానుల్ని టెన్ష‌న్ పెట్టేశారుగా..

ధోని అభిమానుల్ని టెన్ష‌న్ పెట్టేశారుగా..

మ‌హేంద్ర‌సింగ్ ధోని అభిమానుల్ని గురువారం సాయంత్రం ఓ వార్త‌ విప‌రీత‌మైన ఉత్కంఠ‌కు, ఉద్వేగానికి గురి చేసింది. ధోని అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌బోతున్నాడ‌ని.. ఇందుకోసం సాయంత్రం 7 గంట‌ల‌కు ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన‌బోతున్నాడ‌ని ఈ రోజు మ‌ధ్యాహ్నం నుంచి ఒక ప్ర‌చారం ఊపందుకుంది.

దీనికి అస‌లు కార‌ణం టీమ్ ఇండియా కెప్టెన్ కోహ్లీనే అని చెప్పాలి. అత‌ను ఈ రోజు ఉద‌యం 2016 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓ మ్యాచ్ సంద‌ర్భంగా ధోనికి సెల్యూట్ చేస్తున్న ఫొటో ఒక‌టి ట్విట్ట‌ర్లో షేర్ చేశాడు. ఆ మ్యాచ్‌లో ఫిట్‌నెస్ టెస్టు కోసం ప‌రుగెత్తించిన‌ట్లుగా త‌న‌ను ధోని ప‌రుగెత్తించాడ‌న్నాడు. ఐతే కోహ్లి మోకాళ్ల‌పై కూర్చుని ధోనికి సెల్యూట్ చేస్తున్న‌ట్లుగా ఉన్న ఆ ఫొటో చూసి జ‌నాల‌కు ఏవేవో సందేహాలు మొద‌ల‌య్యాయి. ఇంత‌లోనే ధోని రిటైర్మెంట్ అంటూ ప్ర‌చారం మొద‌లైంది.

సాయంత్రం ప్రెస్ మీట్ అనే వార్త దావాన‌లంలా వ్యాపించేసింది. సోష‌ల్ మీడియాలో ధోని అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్లు చేశారు. ఆరాలు తీశారు. కొంద‌రు ఈ రోజు ధోని రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న‌ ప‌క్కా అని ధ్రువీక‌రించేశారు. దీంతో ఓ దిగ్గ‌జ ఆట‌గాడి కెరీర్ ముగింపు అంటూ అభిమానులు ఉద్వేగానికి గురైపోయారు. ధోని గొప్ప‌ద‌నాన్ని చాటే ఘ‌న‌త‌లు, గ‌ణాంకాలు, వ్యాఖ్యానాల‌తో ట్విట్ట‌ర్‌ను హోరెత్తించేశారు. కానీ తీరా 7 గంట‌ల స‌మ‌యం అయ్యాక ప్రెస్ కాన్ఫ‌రెన్స్ ఊసే లేక‌పోయింది. ధోని అస‌లు ఇండియాలోనే లేడ‌న్న స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చింది.

ధోని రిటైర్మెంట్ గురించి త‌మ‌కైతే ఏ స‌మాచారం లేద‌ని భార‌త క్రికెట్ చీఫ్ సెల‌క్ట‌ర్ ఎమ్మెస్కే ప్ర‌సాద్ ధ్రువీక‌రించాడు. ఈ వార్త‌లు అబద్ధ‌మ‌ని కూడా అన్నాడు. ధోని భార్య సాక్షి సైతం ఈ విష‌య‌మై స్పందించింది. వీటినే రూమ‌ర్లు అంటారు అని ట్విట్ట‌ర్లో కామెంట్ పెట్టి అభిమానుల్లో ఉత్కంట‌కు తాత్కాలికంగా తెర‌దించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English