టీఆర్ఎస్‌కు మ‌రో షాక్‌... బీజేపీ ఎంపీతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ

టీఆర్ఎస్‌కు మ‌రో షాక్‌... బీజేపీ ఎంపీతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ

తెలంగాణలో రాజకీయాల్లో రోజుకొక సంచ‌ల‌న వార్త రాష్ట్ర రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తోంది. ఎప్పుడు ఏ నేత ఏ పార్టీకి షాక్ ఇస్తాడో ?  కూడా అర్థం కాని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే టీఆర్ఎస్‌లో ఓన‌ర్ డైలాగ్ కొట్టిన నేత‌ల‌ను టార్గెట్‌గా చేసుకుని కేటీఆర్ కౌంట‌ర్ ఇచ్చారో లేదో ఇప్పుడు ఆ పార్టీకి మ‌రో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. టీఆర్ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీతో భేటీ కావ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది.

టీఆర్ఎస్ పార్టీకి చెందిన నిజామాబాద్ జిల్లా బోధ‌న్‌ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ అదే జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను కలిసి చర్చలు జరపటం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. దీంతో షకీల్ పార్టీ మార్పుపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. బోధ‌న్ నుంచి ష‌కీల్ వ‌రుస‌గా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిజామాబాద్‌తో పాటు ఉత్త‌ర తెలంగాణ‌లో మైనార్టీల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. ష‌కీల్ మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత పార్టీలో ఒక్కొక్క‌రు త‌మ అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తున్నారు.

వీరంద‌రికంటే భిన్నంగా ష‌కీల్ ఇప్పుడు ఏకంగా బీజేపీ ఎంపీతో భేటీ అయ్యి సంచ‌ల‌నం సృష్టించారు. ఈ భేటీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇంకా ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారనే విషయంపై ఎంపీ అరవింద్ కు, షకీల్‌కు మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ష‌కీల్ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ముఖ్య‌మంత్రి కుమార్తె, మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో చాలా స‌న్నిహితంగా ఉండేవారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఆమె ఓడిపోవ‌డం... ఇటు త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో ఆయ‌న కాస్త సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఏకంగా క‌విత‌నే ఓడించిన బీజేపీ ఎంపీ అర్వింద్‌తో భేటీ కావ‌డంతో టీఆర్ఎస్ వ‌ర్గాలు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యాయి.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు బిజెపిలో చేరడానికి సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అరవింద్ - షకీల్ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మ‌రోవైపు బీజేపీ టీఆర్ఎస్‌లో ఎవ‌రు అసంతృప్తితో ఉన్నా వారికి రెడ్ కార్పెట్ వేసి మ‌రీ పార్టీలో చేర్చుకునేందుకు రెడీగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English