వైరల్ పిక్... కరుణానిధి లుక్కులో చింతమనేని

వైరల్ పిక్... కరుణానిధి లుక్కులో చింతమనేని

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బుధవారం అరెస్టైన టీడీపీ సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను చూస్తే... నిజంగానే డీఎంకే దివంగత వ్యవస్థాపకుడు, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధే కనబడ్డారు.కళ్లకు నల్ల కళ్లద్దాలు... మెడలో పసుపు కండువా, తలపై వెంట్రుకలే లేని మోముతో కనిపించిన చింతమనేని నిజంగానే కరుణానిధినే తలపించారు. పోలీసులు ఆయనను తమ చేతులపై ఎత్తుకుని వెళుతుంటే... చుట్టూ చేరిన కార్యకర్తలతో కరచాలనం చేస్తూ, నమస్కారం పెడుతూ కనిపించిన చింతమనేని.. అచ్చు గుద్దినట్టు కరుణానిధి మాదిరే కనిపించారు. కరుణలా కనిపించిన చింతమనేని వీడియోతో పాటు ఫొటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గానే మారిపోయాయి.

సాధారణంగా చింతమనేని ఎప్పుడు కనిపించినా... మాసిన గడ్డం, దురుసు వర్తన, ఏమాత్రం పట్టశక్యం కాని ఆగ్రహం... ఇలా చింతమనేని రూపం తెలుగు నేల ప్రజలకు చిరపరచితమే. అప్పుడప్పుడు ఇదే లుక్కుకు మరింత మాస్ ఇమేజీని జోడించే చింతమనేని... తలకు ఓ తువ్వాలును పాగాగా చుట్టుకుని మరింత మాస్ లీడర్ గా కనిపిస్తారు. మొత్తంగా చింతమనేనిని క్లీన్ షేవ్ తో గానీ, తలపై వెంట్రుకలు గానీ లేకుండా చూసిన వారు చాలా తక్కువేనని చెప్పాలి. చింతమనేని వస్తున్నారంటేనే... ఓ మాస్ లీడర్ వచ్చినట్టుగానే కనిపిస్తుంది.

అలాంటిది మొన్న తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సమయంలో మీడియా ముందుకు వచ్చిన చింతమనేని నున్నగా గుండు గీయించుకుని కనిపించారు. తిరుమల వెళ్లానని, వెంకన్నను తలనీలాలు సమర్పించానని చెప్పిన చింతమనేని తనపై దురుద్దేశపూర్వకంగానే కేసు పెట్టారని ఆరోపించారు. తానెక్కడికీ పారిపోలేదని,. ఇంటిలోనే ఉంటానని చెప్పి చింతమనేని... ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయారు. ఏకంగా 12 రోజుల పాటు కనిపించకుండాపోయిన చింతమనేని ఎట్టకేలకు బుధవారం ఉదయం పోలీసులకు లొంగిపోదామనే వచ్చారు. అయితే ఆయన రాకను పసిగట్టిన పోలీసులు లొంగిపోకముందే అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కనిపించిన దృశ్యాల్లో చింతమనేని ప్లేసులో కరుణానిధి కనిపించేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English