గ‌మ‌నిక‌... టీఆర్ఎస్‌లో లేదు చీలిక‌!

గ‌మ‌నిక‌... టీఆర్ఎస్‌లో లేదు చీలిక‌!

దీర్ఘ‌కాలం త‌ర్వాత ఏర్పాటు చేసిన తెలంగాణ పూర్తి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ  టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తుల‌ను బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసింది. అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో, బ‌హిరంగంగా మీడియా ముందు టీఆర్ఎస్ నేత‌లు త‌మ ఆవేశాన్ని వెళ్ల‌గ‌క్కారు.

అయితే....ఈ ప‌రిణామం గులాబీ బ్యాచ్‌ను తీవ్రంగా ఇర‌కాటంలో ప‌డేసిన నేప‌థ్యంలో....న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆయా నేత‌ల‌తో వేర్వేరుగా మీడియాతో మాట్లాడింప‌చేశారు. పార్టీపై, తమపై వ్యక్తిగత ఆరోపణలు మానుకోవాలని, వక్రీకరణలు వద్దని మాజీమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు స్పష్టంచేశారు.

పార్టీ మారే స‌మ‌యంలో మంత్రి ప‌ద‌విపై గంపెడాశ‌లు పెట్టుకున్న‌ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మీడియాతోత మాట్లాడుతూ....తాను మంత్రి పదవి ఆశించి భంగపడినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదన్నారు. తమపై బురదజల్లడం మానుకోవాలని, పార్టీ నుంచి వీడుతున్నట్టు, అలకబూనినట్టు చేస్తున్న ప్రచారాన్ని ఆపాలని ఆయన విజ్ఞప్తిచేశారు. మంత్రులుగా ఎవరుండాలన్నది ముఖ్యమంత్రి విచక్షణతో నిర్ణయం తీసుకుంటారని, తనతోపాటు తన భార్య జ్యోతికి కూడా టీఆర్‌ఎస్‌లో సముచితస్థానమే ఉన్నదని, పార్టీ నాయకత్వంపై తమకెలాంటి అసంతృప్తిలేదని స్పష్టంచేశారు.

ఇక మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి రాజ‌య్య మాట్లాడుతూ....తాను చేయని వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయ‌న్నారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు.  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ...టీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా.. నేను నిఖార్సయిన టీఆర్‌ఎస్ నాయకుడిని.. పదవుల కోసం పాకులాడే వ్యక్తినికాదు అంటూ ప్ర‌క‌టించారు.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ...మంత్రిపదవి రానందుకు తనకు అసంతృప్తిలేదని  తెలిపారు. తనకు కేసీఆర్‌పై పూర్తి నమ్మకం ఉన్నదని, తాను ఎవ్వరినైతే నమ్ముతానో వారితో చివరివరకు ఉంటానని, తమ నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English