ఆ ట్రక్కు యజమానికి రూ.1.40 లక్షల ఫైన్.. చేసిన తప్పు ఇదే

ఆ ట్రక్కు యజమానికి రూ.1.40 లక్షల ఫైన్.. చేసిన తప్పు ఇదే

కొత్తగా అమల్లోకి వచ్చిన మోటారు వాహన చట్టం అమలు ప్రజల్ని హాహాకారాలు చేసేలా చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అమలు కాని ఈ చట్టం.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతూ డ్రైవర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ మధ్యనే ఒక లారీ డ్రైవర్ కు రూ.80వేలకు పైనే జరిమానా విధించిన వైనం మర్చిపోక ముందే.. తాజాగా మరో ఉదంతం తెర మీదకు వచ్చింది.

రాజస్థాన్ కు చెందిన ఒక  ట్రక్కు డ్రైవర్ కు ఏకంగా రూ.1.40లక్షల జరిమానాను విధించారు. ఇంతకీ అతగాడికి అంత భారీగా ఫైన్ విధించటం వెనుక కారణం చూస్తే.. పరిమితికి మించి ఓవర్ లోడ్ తో ప్రయాణించటంతో అతడికి రూ.1,41,700 జరిమానాను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఒక ట్రక్కు యజమానికి విధించిన రూ.1.16 లక్షల జరిమానా కంటే ఇది ఎక్కువ.

ట్రాఫిక్ నిబంధనలతో పాటు.. రూల్స్ ను అతిక్రమిస్తున్న వాహనదారులకు భారీగా ఫైన్లు వేస్తున్న నేపథ్యంలో.. తాజా జరిమానా దేశంలోనే అత్యధిక ఫైన్ చెల్లించిన డ్రైవర్ గా రికార్డుల్లోకి ఎక్కారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English