టీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంప్‌...బీజేపీ ఏమంటోందంటే...

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంప్‌...బీజేపీ ఏమంటోందంటే...

టీఆర్ఎస్ పార్టీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ క‌లక‌లం సృష్టించింద‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కొంద‌రు ఎమ్మెల్యేల పేర్ల‌ను ప్ర‌స్తావిస్తూ ప‌లువురు నెటిజ‌న్లు త‌మ ఊహా శ‌క్తికి ప‌దునుపెట్టారు. `ఈ నెల 17న అమిత్ షా పిలుపు మేరకు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ మార‌నున్నారు. ఈ ముగ్గురు గత నాలుగు రోజుల క్రితం మైనంపల్లి పార్టీ ఆఫీస్ మల్కాజిగిరి లో సమావేశం అయినట్టు సమాచారం`` అంటూ మీడియాలో వైర‌ల్ అయింది.  ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సైతం ఇదే బాట‌లో ఉన్న‌ట్లు ప‌లువురు పేర్కొన్నారు. అయితే, ఇదంతా...అవాస్త‌వ‌మ‌ని తేలింది.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ...తాను నిఖార్సయిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడిన‌ని తెలిపారు. ``ప‌దవుల కోసం పాకులాడే వ్యక్తిని కాను.తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేశా. కారు గుర్తు, టీఆర్ఎస్ పార్టీలోనే  ఉన్నాను. కొనసాగుతాను. పార్టీ మారుతానంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దు.అలాంటి ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తున్న.`` అని ప్ర‌క‌టించారు.

రాజ‌య్య మీడియాతో మాట్లాడుతూ... డిప్యూటీ సీఎం పదవి పోయినా.. ప్రభుత్వంలో అనేక రకాలుగా త‌న‌ను ప్రోత్సహించారని రాజ‌య్య అన్నారు.``నేను నాలుగోసారి గెలవడానికి కేసీఆర్‌, కేటీఆర్‌ కారణం. నా జీవితాంతం టీఆర్‌ఎస్‌లోనే ఉంటాను. గత ఎన్నికల్లో నా గెలుపులో కేటీఆర్‌ పాత్ర ఎంతో ఉంది. నా జీవితాంతం వారు ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాను. `` అని తెలిపారు.

కాగా, బీజేపీ సైతం ఈ జంపింగ్‌ల‌పై స్పందించింది. టీఆర్ఎస్ పార్టీ నేత‌ల చేరిక‌పై ఎలాంటి ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డం లేద‌ని తెలిపింది. ఈ విష‌యంలో జ‌రుగుతున్న ప్ర‌చారం నిజం కాద‌ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్ర‌తినిధి కృష్ణ‌సాగ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యేల జంపింగ్ అంతా నీటి బుడ‌గ‌లా తేలిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English