ఎంట్రీలోనే కేసీఆర్ కు చుక్కలు చూపిన తమిళిసై?

ఎంట్రీలోనే కేసీఆర్ కు చుక్కలు చూపిన తమిళిసై?

అనుకున్నదే నిజమైంది. అంచనానే కరెక్ట్ అయ్యింది. మాజీ సివిల్ సర్వెంట్ అయిన గవర్నర్ నరసింహన్ హయాంలో మాదిరి కాకుండా.. కరుడుగట్టిన బీజేపీ కార్యకర్త నుంచి ఎదిగి అత్యున్నత స్థానానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంట్రీలోనే చుక్కలు కనిపించాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

తాను వస్తున్న రోజునే మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని పెట్టిన కేసీఆర్ నిర్ణయాన్ని ఆమె ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. తాను గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన రోజే.. మంత్రివర్గ విస్తరణ ఎలా చేస్తారని ప్రశ్నించటంతో పాటు.. అందుకు ఆమె సానుకూలంగా రియాక్ట్ కాలేదని తెలుస్తోంది.

కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన కొత్త విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. నిజానికి తమిళిసై ఈ నెల 11న హైదరాబాద్ కు వస్తానని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అలాంటిది.. ముందు చెప్పిన దాని కంటే మూడు రోజుల ముందే వచ్చేశారు. తాను వచ్చిన రోజునే కేబినెట్ విస్తరణకు ఆమె సానుకూలంగా లేకపోవటంతో.. ప్రభుత్వ పెద్దలు కేంద్రంలోని పెద్దల్ని సంప్రదించి.. తమకున్న ఇబ్బందుల్ని వివరించినట్లుగా తెలుస్తోంది.

తొమ్మిదిన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని.. ముహుర్తం కూడా కుదిరిన నేపథ్యంలో తమ అభ్యర్థనను మన్నించాలని గులాబీ అగ్రనేతలు కేంద్రంలోని పెద్దల్ని కోరినట్లుగా సమాచారం. దీంతో.. వారు సానుకూలంగా రియాక్ట్ కావటంతో.. తమిళిసై అందుకు ఓకే చెప్పారంటున్నారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్న వేళ.. తాను కోరుకున్నట్లు పనులు చేయించుకోవటంలో సక్సెస్ అయిన కేసీఆర్.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉండవన్న విషయం మేడమ్ తన ఎంట్రీతోనే గులాబీ బాస్ కు అర్థమయ్యేలా చేశారని చెబుతున్నారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికర పరిణామాలు ఖాయమని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English