హ‌రీశ్ ఓ డ‌మ్మీ...మొద‌టిరోజే చెప్పిన కేసీఆర్‌

హ‌రీశ్ ఓ డ‌మ్మీ...మొద‌టిరోజే చెప్పిన కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు...టీఆర్ఎస్ పార్టీ నేత త‌న్నీరు హ‌రీశ్ రావు ఎట్ట‌కేల‌కు మంత్రివ‌ర్గంలో చేరిన సంగ‌తి తెలిసిందే. సుదీర్ఘ‌కాలం నిరీక్ష‌ణ త‌ర్వాత‌....హ‌రీశ్‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అదే స‌మ‌యంలో ఎవ‌రూ ఊహించని విధంగా ఆర్థిక శాఖ ద‌క్కింది. అయితే, హ‌రీశ్‌కు ఇచ్చిన ఆర్థిక శాఖ‌పై అప్పుడే....భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ...సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హ‌రీశ్ ఓ డ‌మ్మీ అని ఆయ‌న తేల్చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్డెట్ చాలా ఆలస్యమయిందని కృష్ణ‌సాగ‌ర్ రావు పేర్కొన్నారు. ``బడ్జెట్ లో కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. సీఎం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గణాంకాలు వాస్తవానికి విరుద్దంగా ఉన్నాయి. బడ్జెట్‌లో  రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక ప్రగతికి సంబందించిన ప్రణాళిక సరిగా లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అకౌంట్ల విండో డ్రెస్సింగ్ కనిపిస్తోంది.`` అని ఆరోపించారు. కొత్త ఆర్థికమంత్రిగా హరీశ్‌ రావు ఆదివారం ప్రమాణ స్వీకారం చేసినప్ప‌టికీ మ‌రుస‌టిరోజు కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టడం హరీశ్ పరిస్థితిని స్పష్టం చేస్తోందని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు డమ్మి మంత్రి అనే మొదటిరోజు నుంచే సీయం స్పష్టం చేసినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 

ఆర్థిక మందగమనం ప్రపంచాన్ని తాకముందే తెలంగాణను తాకిందని బీజేపీ బలంగా నమ్ముతోందని కృష్ణ‌సాగ‌ర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత‌  నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానా తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం వద్ద నిధుల లేవు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక అబ‌ద్దాల చిట్టా...... అసత్యాల పుట్ట అని మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అప్పుల బారిన పడిన రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ పరిస్థితిని వివరించలేదు అని త‌ప్పుప‌ట్టారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్న నిధుల్లో కోత విధిస్తుందని ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ ఆర్థిక  తప్పిదాలను కాగ్ చాలా స్పష‌్టంగా ఎత్తిచూపిందన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English