మాంద్యాన్ని మాగ్జిమమ్ వాడేసిన కేసీఆర్

మాంద్యాన్ని మాగ్జిమమ్ వాడేసిన కేసీఆర్

తెలివంటే కేసీఆర్ దే బాసూ. అవకాశాన్ని ఎంతలా వాడుకోవాలో ఆయన తన బడ్జెట్ స్పీచ్ తో అందరికి అర్థమయ్యేలా చేశారని చెప్పాలి. అదిగో.. ఇదిగో అంటూ మాంద్యం బూచి గురించి గడిచిన కొద్దిరోజులుగా చెబుతున్న మాంద్యాన్ని ప్రస్తావిస్తూ.. గత సంవత్సరం.. తాజా సంవత్సరంలో ప్రభుత్వ వైఫల్యాన్ని భలేగా కప్పేసుకున్నారు తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లుగా మాంద్యం అంత తీవ్రంగా ఉండి ఉంటే.. గడిచిన ఏడాదిన్న కాలంలో ఒక్కసారి కూడా ఆయన ఎందుకు ప్రస్తావించనట్లు? మాంద్యం ప్రభావం ఒక్క ప్రభుత్వం మీదనే కాదు కదా?  అన్ని రంగాల మీదా.. ప్రజల మీదా ఉంటుంది కదా?  అలాంటప్పుడు ఏడాదిన్నరలో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ఎందుకు అలెర్ట్ చేయలేదు.

ఈ రోజున బడ్జెట్ స్పీచ్ లో భారీగా మాంద్యం గురించి ప్రస్తావించి బెదరగొట్టేసిన కేసీఆర్ మాటలు చూస్తే.. లోటు పోటును విమర్శకులు ఎత్తి చూపించకుండా ఉండేందుకు మాంద్యాన్ని మాగ్జిమమ్ వాడేశారని చెప్పాలి. కరెంట్ ఇష్యూగా ఉన్న మాంద్యాన్ని తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు తెలివిగా వాడేసిన కేసీఆర్..సేఫ్ గా తప్పించుకున్నారని చెప్పాలి. కేసీఆరా మజాకా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English