ఏపీ పాలిటిక్స్‌లో ట్విస్ట్‌: ద‌శాబ్దాల బ‌ద్ధ శ‌త్రువులు వైసీపీలోకే...

ఏపీ పాలిటిక్స్‌లో ట్విస్ట్‌: ద‌శాబ్దాల బ‌ద్ధ శ‌త్రువులు వైసీపీలోకే...

ఏపీ పాలిటిక్స్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపు చోటు చేసుకోబోతోంది. ద‌శాబ్దాల రాజ‌కీయ వైరం ఉన్న ఇద్ద‌రు బ‌ద్ధ శ‌త్రువుల ఒకే పార్టీలోకి రాబోతున్నారు. వారిద్ద‌రూ ఒకే నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు కోసం ఏకంగా మూడు ద‌శాబ్దాలుగా తీవ్ర‌మైన యుద్ధాలు చేశారు. వారు ప్ర‌తిసారి వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తూ వ‌చ్చారు. ఎంతో వైరుధ్యం ఉన్న బ‌ద్ధ శ‌త్రువులుగా ఉన్న వారిద్ద‌రు ఎట్ట‌కేల‌కు ఇప్పుడు శ‌త్రువులు అవుతున్నారు. ఒకే పార్టీలో చేర‌బోతున్నారు. ఇంత‌కు ఆ ఇద్ద‌రు నేత‌లు ఎవ‌రో ?  కాదు మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు.

తూర్పు గోదావ‌రి జిల్లా రామ‌చంద్రాపురం నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా 1989 నుంచి వీరి మ‌ధ్య రాజ‌కీయ ఆధిప‌త్యం కొన‌సాగుతూ వ‌చ్చింది. వీరిద్ద‌రు రెండు వేర్వేరు బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గాల‌కు ప్రాధినిత్యం వ‌హిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి సీనియ‌ర్ నేత‌గా ఉన్న రామచంద్రపురం మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు. ఆయన టిడిపికి రాం రాం చెప్పి జగన్ సమక్షంలో వైసిపిలో చేరేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీలో ఎప్ప‌టి నుంచో ఉన్న ఆయ‌న‌కు చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంతో ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న అల‌క‌బూనారు.

అయితే ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న వైసీపీలోకి వెళ‌తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట వైసీపీ ఎమ్మెల్యే సామినేను ఉద‌య‌భానుకు తోట స్వ‌యానా వియ్యంకుడు కావ‌డంతో అటు నుంచి కూడా తోట‌ను వైసీపీలోకి తీసుకు వెళ్లే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. మంత్రి ప‌ద‌వి డిమాండ్ చేయ‌డంతో తోట వైసీపీ ఎంట్రీకి బ్రేక్ ప‌డింది. చివ‌ర‌కు ఎన్నిక‌ల్లో తోట టీడీపీ నుంచే పోటీ చేయ‌గా ఆయ‌న ఓడిపోయారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత తోట టీడీపీ కాపు నేత‌ల‌తో ఓ భేటీ కాకినాడ‌లో ఏర్పాటు చేశారు. అప్ప‌టి నుంచి ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. చంద్ర‌బాబు జిల్లా ప‌ర్య‌ట‌న‌లోనూ ఆయ‌న డుమ్మా కొట్టేశారు. ఇక ఆయ‌న‌పై పాత కేసులు ఉన్న నేప‌థ్యంలో వాటిని ఎదుర్కోవ‌డం కోసం ఇప్పుడు ఆయ‌న అధికార పార్టీలో చేర‌క త‌ప్ప‌ని పరిస్థితి.
 
రామ‌చంద్రాపురం నియోజ‌క‌వ‌ర్గంలో శెట్టిబ‌లిజ‌ల‌కు, కాపుల‌కు అస్స‌లు ప‌డ‌దు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం అక్క‌డ శెట్టిబ‌లిజ వ‌ర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపుల్లో బ‌ల‌మైన తోట కూడా వైసీపీలోకి వ‌చ్చేస్తే అక్క‌డ పార్టీకి తిరుగు ఉండ‌దు. ఇక మంత్రి బోస్‌ది కూడా అదే నియోజ‌క‌వ‌ర్గ‌మే అన్న సంగ‌తి తెలిసిందే. ముగ్గురు బ‌ల‌మైన నేతలు వైసీపీలో ఉండే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అస‌లు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చోటే ఉండ‌దు. ఇక బోస్ కూడా స్థానికంగా పార్టీ బ‌లోపేతం నేప‌థ్యంలోనే తోట‌ను ప‌ట్టుబ‌ట్టి చ‌క్రం తిప్పి వైసీపీలోకి తీసుకు వెళ్లే ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఎవ్వరు వుండరనేది మ‌రోసారి బోస్ - తోట విష‌యంలో రుజువైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English