తెలంగాణపై మరింత క్లియర్

తెలంగాణపై మరింత క్లియర్

తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ మరింత క్లారిటీ ఇచ్చేసింది. మహానాడులో తెలంగాణ గురించి తీర్మానం చేసే ధైర్యం ఉందా? అని టీఆర్ఎస్ నేతలు సవాలు విసరటం గుర్తుండే ఉంటుంది. దానికి బదులుగా రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ నేతలు తెలంగాణపై చేయాల్సిన తీర్మానం కాపీని ఇస్తే దాన్నే మహానాడులో తీర్మానం చేస్తామంటూ కౌంటర్ అటాక్ ఇచ్చిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. సమయానికి మాట్లాడటం.. ఆ తర్వాత మర్చిపోవటం లాంటివి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఉండదని మరోసారి రుజువైంది.

ఏ విషయం పైన అయినా క్లియర్ గా... క్లారిటీతో వ్యవహరిస్తుందని మరోసారి నిరూపితమైంది. రేవంత్ రెడ్డి ప్రతిసవాలుకు టీఆర్ఎస్ స్పందించకపోయినా.. టీడీపీ మాత్రం తాను చెప్పినట్లుగానే తెలంగాణ అంశాన్ని మహానాడు జరిగిన రెండురోజుల్లోనూ ప్రస్తావించింది. మరీ ముఖ్యంగా మహానాడు చివరి రోజున... ‘‘తెలంగాణకు అనుకూలంగా టీడీపీ తరఫున ప్రణబ్ ముఖర్జీ కమిటీకి 2008లో లేఖ ఇచ్చాం. ఆ లేఖకు కట్టుబడి ఉన్నామంటూ 2012లో కేంద్రానికి మరో లేఖ ఇచ్చాం. ఈ రెండు లేఖల్లోనూ తెలంగాణపై తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇచ్చింది. ఈ రెండు లేఖలకూ పార్టీ కట్టుబడి ఉంది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే’’ అంటూ పూర్తిస్థాయి స్పష్టతతో  ఏకంగా తీర్మానం కూడా చేసేసింది. దీనికి మహానాడు ఏకగ్రీవ ఆమోదం కూడా పలికింది.

తెలంగాణపై పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ అంశంపై పెద్దగా స్పందించలేదు. ఒకవేళ టీడీపీ తీర్మానం కనుక తమకు నష్టం వాటిల్లితే.. ఎప్పటిలానే.. మరింత స్పష్టత ఇవ్వలేదని.. తీర్మానం ముసుగులో తెలంగాణ ప్రజలను మోసం చేయటానికి ఎత్తుగడ వేసిందని ఆరోపిస్తూ విమర్శలు చేసేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు