మ‌లింగ తిరుగులేని ప్ర‌పంచ రికార్డు

మ‌లింగ తిరుగులేని ప్ర‌పంచ రికార్డు

శ్రీలంక ఫాస్ట్ బౌల‌ర్‌, యార్క‌ర్ల కింగ్ ల‌సిత్ మ‌లింగ చెల‌రేగిపోయాడు. న్యూజిలాండ్‌తో ప‌ల్లెకెలేలో జ‌రిగిన మూడో 20-20 మ్యాచ్‌లో మ‌లింగ చెల‌రేగిపోయాడు. నాలుగు వ‌రుస బంతుల్లో న‌లుగురు కీవీస్ ఆట‌గాళ్ల‌ను అవుట్ చేశాడు. దీంతో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లను రెండుసార్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ అరుదైన రికార్డు ఎవ్వ‌రికి లేదు. 36 ఏళ్ల మ‌లింగ ఇటీవ‌లే వ‌న్డేల‌కు గైడ్ బై చెప్పాడు.

వ‌చ్చే యేడాది జ‌రిగే 20-20 ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు జ‌ట్టులో కొన‌సాగాల‌ని డిసైడ్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే కీవీస్‌తో జ‌రుగుతున్న మూడు వన్డేల సీరిస్‌లో భాగంగా మూడో వ‌న్డేలో త‌న ప‌దునైన బంతుల‌తో ఏకంగా ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. నాలుగు ఓవ‌ర్ల‌లో ఆరు ప‌రుగుల‌కు ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇక కీవీస్ ఆట‌గాళ్లు కోలిన్ మన్రో (12), హమీష్ రూథర్‌ఫర్డ్ (0), కోలిన్ డి గ్రాండ్‌హో‌మ్ (0), రాస్ టేలర్ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ పంపాడు.

ఈ క్ర‌మంలోనే మ‌లింగ మ‌రో రికార్డు కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదుసార్లు హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాదు, టీ20ల్లో వంద వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్‌గానూ రికార్డులకెక్కాడు.  పాక్ మాజీ స్పిన్నర్ షాహిద్ అఫ్రిది (97) పేరుపై ఉన్న రికార్డును బద్దలుగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.

126 ప‌రుగుల సులువైన చేజింగ్‌తో బ్యాటింగ్‌కు దిగిన కీవీస్ మ‌లింగ దెబ్బ‌తో మ‌టాష్ అయ్యింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో మలింగ మ్యాజిక్ ప్రారంభమైంది. మూడో ఓవర్ మూడో బంతికి మన్రోను బౌల్డ్ చేసిన మలింగ.. రెండో బంతికి రూథర్‌ఫర్డ్, మూడో బంతికి గ్రాండ్‌హోమ్, నాలుగో బంతికి రాస్ టేలర్‌లను వరుసగా పెవిలియన్ పంపాడు. మలింగ దెబ్బకు కీవీస్ 16 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలి 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English