రిస్క్ తీసుకున్న ఇస్రో.. ఇస్మార్ట్ విక్రమ్ ఎందుకంటే?

రిస్క్ తీసుకున్న ఇస్రో.. ఇస్మార్ట్ విక్రమ్ ఎందుకంటే?

కొన్నిసార్లు కష్టపడినా ఫలితం దక్కదు. తాజా చంద్రయాన్ -2లో ఫలితం దక్కిందా?  లేదా? అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రుడిపైన ల్యాండ్ కావటానికి మరో ఐదు నిమిషాల వ్యవధిలో ఉన్న వేళ.. సిగ్నల్స్ కు కట్ అయిపోవటంతో.. చంద్రయాన్ 2 తుది ఫలితం ఏమిటన్నది తేలకుండా ఉండిపోయింది.

చంద్రయాన్ 2 ప్రయోగంలో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ప్రయోగం తుది ఫలితాన్ని తేల్చే చివరి 15 నిమిసాల్ని గ్రౌండ్ నుంచి ఎవరూ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా.. తనకు తానుగా పని పూర్తి చేసేలా తయారు చేశారు. వాస్తవానికి ఇలాంటి సందర్భాల్లో సక్సెస్ రేటు కేవలం 50 శాతమే ఉంటుంది. అయినప్పటికీ ఆ రిస్క్ కు రెఢీ అయ్యింది ఇస్రో.

చంద్రుడి మీదకు ల్యాండ్ అయ్యే చివరి 15 నిమిషాలు మాత్రమే ల్యాండర్ విక్రమ్ ఏ సంకేతాల్ని అందుకోకుండా తనకు తానుగా పని చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎవరూ నియంత్రించాల్సిన అవసరం లేకుండా చేశారు. ల్యాండర్ విక్రమ్ ఒకసారి చంద్రుడి మీదకు దిగినంతనే మళ్లీ కంట్రోల్ మన చేతికి వస్తుంది.

సరిగ్గా.. ఈ సమయంలోనే సంకేతాలు ఆగిపోయాయి. ఈ కారణంతోనే చివరి 15 నిమిషాల ఘట్టాన్ని 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్ అని వ్యవహరించారు. తొలుత ఈ విషయాన్ని ఇస్రో చీఫ్.. కొద్దిమంది ముఖ్య శాస్త్రవేత్తలు తప్పించి.. మిగిలిన వారెవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఆ మాటలు ఎంత కీలకమన్నది ప్రాక్టికల్ లోకి వచ్చాక కానీ అర్థం కాని పరిస్థితి. మరి తుది ఫలితం ఏమైందన్న దానిపై ఇస్రో చేసే ప్రకటన కీలకం కానుంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English