ఇస్రో శివన్ కంట ఆగని కన్నీరు... గుండెలకు హత్తుకుని ఓదార్చిన మోదీ

ఇస్రో శివన్ కంట ఆగని కన్నీరు...  గుండెలకు హత్తుకుని ఓదార్చిన మోదీ

చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన సమయంలో దేశం మొత్త తీవ్ర ఆవేదనలో కూరుకుపోయింది. చంద్రయాన్ 2 ప్రయోగంలో నిన్న సాయంత్రం దాకా దాదాపుగా అన్ని దశలు విజయవంతమైనా... చంద్రుడి ఉపరితలంపై ల్యాండర విక్రమ్ ల్యాండయ్యేందుకు పట్టే 15 నిమిషాలు అత్యంత కీలకమన్న విషయం తెలిసిందే కదా.

ఈ కీలక సమయంలో విక్రమ్ తో కంట్రోల్ రూంకు ఉన్న సిగ్నల్స్ తెగిపోయాయి. అయినా మొక్కవోని సంకల్పంతో సిగ్నల్స్ ను పునరుద్ధరించేందుకు ఇస్రో చేసిన యత్నాలేవీ ఫలించలేదు. దీంతో చంద్రయాన్ 2 విఫల ప్రయోగంగా మిగిలిపోయింది.

వరుస ప్రయోగాలతో మంచి ఊపు మీద ఉన్న ఇస్రో... చంద్రయాన్ 2 వంటి కీలక ప్రయోగంలో విఫలమవడంతో ఆ సంస్థ బాస్ గా ఉన్న శివన్ నిజంగానే చిన్నపిల్లాడికి మల్లే వెక్కి వెక్కి ఎడ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ... శివన్ ను తన గుండెలకు హత్తుకుని మరీ ఓదార్చిన తీరు ఇప్పుడు నిజంగానే వైరల్ గా మారిపోయింది.

చంద్రయాన్ 2 ప్రయోగంలో కీలక దశ అయిన విక్రమ్ ల్యాండింగ్ గడచిన రాత్రి 1.55 గంటలకు జరగాల్సి ఉంది. చంద్రుడి ఉపరితలంపైకి విక్రమ్ ల్యాండయ్యే కీలక ఘట్టాన్ని ప్రత్యక్ష్యంగా తిలకించేందుకు మోదీ బెంగళూరులోని కంట్రోల్ రూంకు వెళితే... దేశ ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు.

అప్పటిదాకా అంతా సవ్యంగానే సాగిన చంద్రయాన్ 2 చివరి మెట్టుపై... చంద్రుడి మీదకు విక్రమ్ దిగే సమయంలో... చంద్రుడికి కేవలం 2.1 కిలో మీట్ల దూరంలో ఉండగా కంట్రోల్ రూంతో విక్రమ్ కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. అయితే సిగ్నల్స్ ను పునరుద్ధరించేందుకు ఇస్రో తన వంతు యత్నాలు ,చేసింది. ఈ యత్నాలేవీ ఫలించకపోవడంతో చంద్రయాన్ 2 విఫలమైందని చెప్పక తప్పదు.

దేశ ప్రజలందరినీ తీవ్ర ఉత్కంఘకు గురి చేసిన ఈ ప్రయోగం విఫలమవడంతో ఇస్రో చైర్మన్ శివన్ తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. దీంతో ప్రధాని అక్కడే ఉన్నా కూడా ఆయన తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయారు. మోదీ కనిపించగానే... శివన్ చిన్నపిల్లాడికి మల్లే వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో షాక్ కు గురైన మోదీ కూడా వెనువెంటనే తేరుకుని శివన్ ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు.

న్నీళ్లు ఉబికివస్తుంటే... శివన్ తన కళ్లద్దాలను తీసి మరీ బోరుమనగా... శివన్ పరిస్థితిని చూసిన మోదీ... ఆయనను తన గుండెలకు హత్తుకున్నారు. కొన్ని నిమిషాల పాటు శివన్ ను వదలని మోదీ... శివన్ వెన్ను నిమురుతూ... ఓదార్చారు. చాలా సేపటికి శివన్ తేరుకోగా... మోదీ ఆయన భుజం తట్టి... ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశమంతా మీ వెంటే ఉందని, ఈ ప్రయోగాన్ని ఇంతదాకా తీసుకువచ్చి గొప్ప విజయం సాధించారని భరోసా ఇచ్చారు.

చంద్రయాన్ 2 విఫలంతో కుంగిపోవద్దని, మరిన్ని ప్రయోగాలకు సిద్ధం కావాలని, దేశం మొత్తం మీ వెంటే ఉంటుందని భరోసా ఇచ్చి అక్కడి నుంచి కదిలారు. శివన్ చిన్నపిల్లాడిలా ఏడ్చిన తీరు, ఆయనను మోదీ ఓదార్చిన వైనానికి సంబంధించిన సన్నివేశాలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English