చంద్రబాబుకు షాకిచ్చిన ఆ ముగ్గురు

చంద్రబాబుకు షాకిచ్చిన ఆ ముగ్గురు

పాపం.. ఎన్నికల్లో ఓటమి తరువాత ప్రజల ముందే కాదు పార్టీ నేతల్లోనూ చంద్రబాబు చులకనైపోతున్నారు. ఆయన్ను పార్టీ నేతలెవరూ పట్టించుకోవడం లేదట. చంద్రబాబు ఇప్పటికే నిర్వహించిన సమావేశాలకు కాపు నేతలు డుమ్మాకొట్టగా.. ఇప్పుడు ఆయన జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు కూడా అక్కడి సీనియర్ నేతలు మొహం చాటేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబుకు అలాంటి అనుభవమే ఎదురైంది.

తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు రెండు రోజుల పర్యటన కోసం వెళ్లగా అక్కడి సీనియర్ నేతలు, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేతలు కొందరు ఆ సమావేశాలకు వెళ్లలేదు. తోట త్రిమూర్తులు, చలమలశెట్టి సునీల్, మాగంటి రూప తదితరులు చంద్రబాబుతో సమావేశాలకు హాజరుకాలేదు.  రాజమండ్రి, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో మొదటి రోజు సమీక్ష నిర్వహించినా అక్కడ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సునీల్, రూపలు డుమ్మా కొట్టేశారు.

చంద్రబాబు సమీక్ష చేస్తున్న విషయాన్ని స్థానిక నేతలు తోట త్రిమూర్తులుకు చెప్పినా ఆయన స్పందించలేదని సమాచారం.  కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలతో తోట దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో తొందరలో టిడిపికి తోట రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కూడా తోట త్రిమూర్తులు కాపు నేతలు సమావేశం కావడం చర్చనీయమైంది. ఆ తరువాత చంద్రబాబు పదేపదే ఒత్తిడి చేయడంతో కాపు నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అయినప్పటికీ పార్టీలో కాపు నేతల అసంతృప్తి మాత్రం తగ్గలేదనడానికి తోట గైర్హాజరు సూచనగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English