చంద్రయాన్-2 ల్యాండింగ్ మీరూ చూడొచ్చు.. ఎలా అంటే

చంద్రయాన్-2 ల్యాండింగ్ మీరూ చూడొచ్చు.. ఎలా అంటే

అంతరిక్ష చరిత్రలో ఇస్రో సువర్ణాక్షరాలు లిఖించే క్షణాలు మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానున్నాయి.  ఈ నేపథ్యంలో ప్రధాని వెూదీ  ‘చంద్రయాన్‌- 2 దక్షిణ ధ్రువంపై దిగుతున్న ప్రత్యేక క్షణాలు చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  అలా వీక్షించిన  విూ ఫోటోలను సామాజిక మాధ్యమంలో షేర్ చేయండి, వాటిలో కొన్నింటిని రీట్వీట్ చేస్తానని కూడా చెప్పారు. అయితే.. చంద్రయాన్ 2 చందమామపై ల్యాండ్ అవడాన్ని ఎలా చూడాలన్న అనుమానం చాలామందికి ఉండొచ్చు. టీవీ చానళ్ల గొడవ లేకుండా నేరుగా మనమే చూడాలంటే ఎలా? దీనికి చాలా మార్గాలున్నాయి.

చంద్రుడి ఉపరితలంపైకి ఈ రోజు రాత్రి 1.30 నుంచి 2.30 మధ్య చంద్రయాన్2 దిగుతుంది. ఆ తరువాత రోవర్ ఉదయం 5.30 నుంచి 6.30 మధ్య చంద్రుడిపై తిరగనుంది. ఇదంతా ఇస్రో లైవ్ ఇస్తోంది. isro.gov.in వెబ్‌సైట్లో ఈ లైవ్ చూడొచ్చు.

యూట్యూబ్‌లో ఈ లైవ్‌ను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) తన చానల్‌లో ప్రసారం చేస్తోంది. ఇక ప్రతి నిమిషం దీనికి సంబంధించి ట్విటర్లో అప్‌డేట్స్ తెలుసుకోవాలనుకుంటే దానికీ మార్గముంది. ట్విటర్లో ఇస్రో హ్యాండిల్‌ను ఫాలో అయితే చాలు.

ఇస్రో పదేళ్ల కిందట చంద్రయాన్ 1 విజయవంతం చేసిన తరువాత మళ్లీ ఇన్నాళ్లకు చంద్రయాన్ 2తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రుడిపై ఇంతవరకు ఏ దేశం వెళ్లని రీతిలో చంద్రుడి రెండో వైపున భారత రోవర్ దిగనుంది. దీన్ని బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ప్రధాని మోదీ వీక్షించనున్నారు. ప్రధాని మోదీతో కలిసి ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించే అవకాశం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది విద్యార్థులకు దక్కింది. వారిలో తెలుగు విద్యార్థిని కూడా ఒకరు ఉండడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English