జ‌గ‌న్ ఆ రిస్క్ చేస్తాడా..!

జ‌గ‌న్ ఆ రిస్క్ చేస్తాడా..!

ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే జంపింగ్‌లో జోరుగా జ‌రుగుతున్నాయి. టీడీపీ నుంచి బీజేపీ, వైసీపీల్లోకి ప‌లువురు నేత‌లు జంప్ చేసేస్తున్నారు. ఇక టీడీపీ నుంచి గెలిచిన వాళ్లు కూడా ఎప్పుడు టైం వ‌స్తుందా ?  గోడ దూకేద్దామా ? అని కాచుకుని కూర్చొని ఉన్నారు. ఇక టీడీపీ నుంచి త‌మ పార్టీలోకి ఆరేడుగురు ప్ర‌జాప్ర‌తినిధులు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథ‌ర్‌రెడ్డి అసెంబ్లీ స‌మావేశాల సాక్షిగానే ప్ర‌క‌టించారు.

తాము గేట్లు ఎత్తితే టీడీపీ ఖాళీ అవుతుందంటూ అటు వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో పాటు ఆ పార్టీ నేత‌లు ప‌దే ప‌దే కామెంట్లు చేస్తున్నారు. మా పార్టీలోకి ఎవ‌రైనా రావాలంటే.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాలి. ఆ త‌ర్వాతే వారిని చేర్చుకుంటాం. పార్టీ మారిన వారి స‌భ్య‌త్వాన్ని స్పీక‌ర్ వెంట‌నే ర‌ద్దు చేయాలని వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అసెంబ్లీలోనే జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లు వైసీపీలోకి వ‌స్తే వారికి ఉన్న ప‌ద‌వులు వ‌దులుకున్నాకే జ‌గ‌న్ త‌న పార్టీలోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్ర‌కాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ వైసీపీలోకి జంప్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు రెండు రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్వాశ్ర‌మంలో ఆయ‌న వైఎస్ ఫ్యామిలీకి అనుచ‌రుడు. ముందు వైఎస్‌, ఆ త‌ర్వాత జ‌గ‌న్ వెంట‌నే న‌డిచారు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచే గెలిచారు. ఆ త‌ర్వాత టీడీపీ ఆయ‌న వ్యాపారాల‌ను దెబ్బ‌కొట్టే ప్ర‌య‌త్నాలు చేయ‌డంతో చివ‌ర‌కు టీడీపీలోకి వెళ్లిపోయారు. టీడీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచారు.

వైఎస్ జ‌గ‌న్ గాలులు ఇంత బ‌లంగా ఉన్నా అద్దంకిలో ర‌వి భారీ మెజార్టీతో గెల‌వ‌డం వెన‌క అత‌డి వ్య‌క్తిగ‌త ఇమేజ్ ప‌నిచేసింద‌నే చెప్పాలి. ఇప్పుడు ర‌వి జిల్లాకే చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సాయంతో వైసీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. ర‌విని పార్టీలోకి తీసుకునేందుకు జ‌గ‌న్ సైతం సుముఖంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ర‌విని పార్టీలో చేర్చుకోవాలంటే జ‌గ‌న్ అద్దంకిలో ఉప ఎన్నిక ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ర‌వికి అక్క‌డ వ్య‌క్తిగ‌త బ‌లంతో పాటు పార్టీ ఇమేజ్‌, టీడీపీ వీక్ అవ్వ‌డంతో అక్క‌డ వైసీపీ గెలుపు పెద్ద క‌ష్టం కాక‌పోయినా ఎంతైనా ఉప ఎన్నిక అంటే కాస్త రిస్కే క‌దా.. మ‌రి జ‌గ‌న్ అంత రిస్క్ తీసుకుంటారా..? అనే అనుమ‌నాలు పార్టీవ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏదేమైనా ర‌వి పార్టీ మారి ప‌ద‌వికి రాజీనామా చేస్తే అద్దంకి ఉప ఎన్నిక ఏపీ పాలిటిక్స్‌ను హీటెక్కించ‌డం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English