వైరల్ వీడియో: ఆ భారీ భవనం నుంచి భారీ జలపాతం..

వైరల్  వీడియో: ఆ భారీ భవనం నుంచి భారీ జలపాతం..

గడిచిన రెండు.. మూడు రోజులుగా ఒక వీడియో వైరల్ గా మారింది. వాట్సాప్ లోనూ.. ఇతర సోషల్ మీడియాలలోనూ పాపులర్ గా మారటమే కాదు.. అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.

నయగారా వాటర్ ఫాల్స్ ను తలపించేలా.. ఒక భారీ భవనం మీద నుంచి కురుస్తున్న జలపాతం.. వావ్ అనేస్తున్నారు. కానీ.. అది అద్భుతం ఎంతమాత్రం కాదు.. ఎందుకంటే.. ఇది ముంబయిలో కురుస్తున్న భారీ వర్షానికి ప్రతీకగా చెబుతున్నారు.

40 అంతస్తుల మీద నుంచి కిందికి ఊరుకుతున్న జలపాతం అందం కోసం ఏర్పాటు చేయలేదు. గడిచిన మూడు రోజులుగా ముంబయిలో కురుస్తున్న భారీ వర్షం.. సదరు 40 అంతస్తుల భవనం పై భాగంలో భారీగా నిలిచిపోయింది. దీంతో.. వాన నీటికి అడ్డుపడిన మార్గాన్ని క్లియర్ చేసే క్రమంలో ఇలాంటి సీన్ ఒకటి క్రియేట్ అయ్యింది.

ముంబయిలోని ఒక ఆకాశ హర్మ్యంపై నుంచి కిందకు పడుతున్న వర్షపు నీటిని ఒకరు వీడియో తీయటంతో ఇది బయటకు వచ్చింది. ఈ వీడియోను ఈఎంఏ భాగస్వామ్యుల్లో ఒకరైన కె.సుదర్శన్ ట్వీట్ చేశారు. చూసేందుకు అందంగా ఉన్న ఈ వీడియో వెనుక ముంబయిలో కురుస్తున్న భారీ వర్షం తీవ్రతకు నిలువెత్తు రూపంగా చెప్పొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English