జ‌న‌సేన‌లో మ‌రో వికెట్‌... వైసీపీలోకి మాజీ మంత్రి...!

జ‌న‌సేన‌లో మ‌రో వికెట్‌... వైసీపీలోకి మాజీ మంత్రి...!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకు ర‌స‌కందాయంగా మారుతోంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి మూడు నెల‌లు కూడా కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీలో గెలిచిన వైసీపీలోకి వ‌ల‌స‌లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా విప‌క్ష టీడీపీ నుంచి ప‌లువురు కీల‌క నేత‌లు ఎడా పెడా ఇత‌ర పార్టీల్లోకి మారిపోతున్నారు. చివ‌ర‌కు టీడీపీకి ఐదేళ్ల‌లో ఎంత‌మంది నేత‌లు మిగులుతారో ? అని ప్ర‌శ్నించుకుంటే వేళ్ల‌మీద లెక్క‌పెట్టేయొచ్చ‌ని క్లీయ‌ర్ పిక్చ‌ర్ క‌న‌ప‌డుతోంది.

న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు టీడీపీకి షాక్ ఇచ్చి బీజేపీలో చేర‌డంతో స్టార్ట్ అయిన వ‌ల‌స‌ల ప‌ర్వం ఆగ‌డం లేదు. ఇక ఏపీలో చాలా మంది టీడీపీ కీల‌క నేత‌లు వైసీపీ బాట ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ జిల్లాలో అన‌కాప‌ల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిన అడారి ఆనంద్‌కుమార్‌, ఆయ‌న సోద‌రి, య‌ల‌మంచిలి మునిసిపాల్టీ మాజీ చైర్మ‌న్ పిల్లా ర‌మాదేవి వైసీపీలో చేరిపోయారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ప‌లువురు నేత‌లు అదే రూట్లో ఉన్నారు.

ఇదిలా ఉంటే మాజీ మంత్రి, జ‌న‌సేన నేత ప‌సుపులేటి బాల‌రాజు సైతం వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. దివంగ‌త నేత వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అండ‌దండ‌ల‌తో రాజ‌కీయంగా మంత్రి స్థాయికి ఎదిగిన బాల‌రాజు విశాఖ జిల్లా పాడేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌. 2009 ఎన్నిక‌ల్లో గెలిచిన బాల‌రాజుకు వైఎస్ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. మంత్రి హోదాలో 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన ఆయ‌న‌... గ‌త ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ పాడేరు సీటు ఆశించారు.

అయితే జ‌గ‌న్ అర‌కు ఎంపీ సీటు ఇస్తాన‌న్నా బాల‌రాజు అంద‌రికి షాక్ ఇస్తూ జ‌న‌సేన‌లో చేరి ఆ పార్టీ నుంచి పాడేరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు జ‌న‌సేన‌లో ఉంటే పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఏంట‌న్న‌దానిపై క్లారిటీ రావ‌డంతో ఆయ‌న చివ‌ర‌కు తాను ముందు అనుకున్న వైసీపీలోకే వెళ్లాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. పార్టీ మారేందుకు డిసైడ్ అయిన బాల‌రాజు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మై వారి నిర్ణ‌యం తీసుకోవ‌డంతో పాటు జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌శంసించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English