ఆటోవాలాకు రూ.32,500 భారీ ఫైన్.. ఎందుకో తెలిస్తే షాకే

ఆటోవాలాకు రూ.32,500 భారీ ఫైన్.. ఎందుకో తెలిస్తే షాకే

కొత్త వాహన చట్టం అమల్లోకి రావటం తెలిసిందే. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు. అయితే.. ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చిన రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న సిత్రాలు చూస్తే షాక్ తినాల్సిందే. తాజాగా రెండు ఉదంతాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

హర్యానాకు చెందిన ఒక ఆటో డ్రైవర్ కు పోలీసులు రూ.32,500 జరిమానాను విధించారు. ఇంతకీ ఆ ఆటోబాబు చేసిన తప్పేమిటో తెలుసా? ఆటోకు సంబంధించిన పేపర్లను ఇంటి దగ్గర మర్చిపోయి రావటం. దీని కోసం అతనికి రూ.32,500 ఫైన్ విధించటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

ఇక.. ఇదే రాష్ట్రంలో ఒక ట్రక్కు డ్రైవర్ కు ఏకంగా రూ.59వేల ఫైన్ వేశారు. ఆటో డ్రైవర్ ఉదంతంతో పోలిస్తే.. ఈ ట్రక్కు డ్రైవర్ కు విధించిన జరిమానాల్లో అంతో ఇంతో అర్థం ఉందనిపించక మానదు. కాకుంటే.. ఇంత భారీ ఫైన్ ఎలా కడతారన్నది ప్రశ్నగా మారింది. ఇంతకీ సదరు ట్రక్కువాలా చేసిన తప్పుల చిట్టాలోకి వెళితే.. సదరు ట్రక్కు డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారని.. బండికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదన్నారు.

అంతేకాక రవాణాకు సంబందించిన వాహనానికి ఉండాల్సిన ఫిట్ నెస్ సర్టిఫికేట్ కూడా లేదని.. థర్డ్ పార్టీ ఇన్య్సూరెన్స్.. పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా చూపించలేదని.. వీటన్నింటికి తోడు.. వాహనంలో ప్రమాదకరమైన వస్తువుల్ని రవాణా చేస్తున్నాడని.. ఈ కారణంతోనే అతడిపై భారీ ఫైన్ వేసినట్లుగా చెబుతున్నారు. చూస్తుంటే.. ఇదే తీరులో జరిమానాల పరంపర సాగితే.. రోడ్డు మీదకు వాహనాన్ని తీసుకురావాలంటే వణికిపోయే పరిస్థితికి తీసుకొస్తారేమో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English