పార్లమెంటుకు వెళ‌తానంటున్న ర‌క్షిత‌!!

పార్లమెంటుకు వెళ‌తానంటున్న ర‌క్షిత‌!!

చూపుల్తోనే గుచ్చి గుచ్చి చంపిన క‌థానాయిక...  ర‌క్షిత‌. ఇడియ‌ట్‌, శివ‌మ‌ణి త‌దిత‌ర చిత్రాల‌తో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. క‌న్నడ‌, త‌మిళంలోనూ బోలెడ‌న్ని సినిమాలు చేసింది. ఈ ముద్దుగుమ్మ ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకొని సినిమాల‌కి గుడ్ బై చెప్పింది. ఇటీవ‌ల రాజ‌కీయాల్లోకి ప్రవేశించింది. పార్లమెంటులోకి అడుగుపెట్టాల‌నేది రక్షిత కోరికట. ఆ మేర‌కు... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయ‌బోతోంద‌ట‌.

క‌ర్ణాట‌క‌లో ఇప్పటికే ఓ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంపిక చేసుకొందని సమాచారం.   జెడియు త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌బోతున్న ఈ ముద్దుగుమ్మ `వ‌చ్చే యేడాది నేను పార్లమెంటులోకి అడుగు పెట్టడం ఖాయ‌మ‌`ని న‌మ్మకంగా చెబుతోంద‌ట‌. క‌న్నడ చిత్ర ప‌రిశ్రమ‌కు చెందిన మ‌రో న‌టి ర‌మ్య  ఇప్పటికే యంపీ గా కొనసాగుతోంది. ఆమెపైనే ర‌క్షితని పోటీ చేయించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట.  రక్షిత సినిమాల్లోలాగా రాజ‌కీయాల్లో కూడా స‌క్సెస్ అవుతుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English