రాజకీయాల్లో 'డిస్కో'

రాజకీయాల్లో 'డిస్కో'

మొత్తానికి రాజకీయాల్లోకి రావడానికి మరో నటి మేకప్ వేసేసుకుని రెడీ అయిపోతున్నారు. దివంగత నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి రాజకీయ ప్రవేశం దాదాపు ఖాయమైనట్లే. శ్రీహరి మరణించడానికి చాలా కాలం ముందుగానే సామాజిక సేవా రంగంలోకి వచ్చాడు. ఆ తరువాత అదే ఊపున వైకాపాలోకి వచ్చాడు.

అంతలోనే తెలంగాణ విభజన రావడంతో కాంగ్రెస్ లోకి వెళ్తాడని వార్తలు వినవచ్చాయి. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నిది శ్రీహరి ఆశ. కానీ అకస్మాత్తుగా మరణించడంతో అది కాస్తా తీరలేదు. ఇప్పుడు శ్రీహరి భార్య డిస్కోశాంతి ఆ రూట్ లో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. దీంతో మ‌ళ్లీ కూక‌ట్‌ప‌ల్లి రాజ‌కీయం ఊపందుకొంది.  త్వ‌ర‌లోనే శాంతి ఈ విష‌యాన్ని తానే స్వయంగా  మీడియాకు వెల్లడిస్తుందని తెలుస్తోంది. అంతా బాగానే వుంది. ఇంకా వైకాపాలోనే వున్నట్లా? కాంగ్రెస్ కు మారినట్లా అన్నదే తెలియాలి

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English