పీకే స‌ల‌హా.. హీరో కొత్త న్యూస్ ఛాన‌ల్‌

పీకే స‌ల‌హా.. హీరో కొత్త న్యూస్ ఛాన‌ల్‌

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవ‌లు పొందడానికి ఇటీవ‌లి కాలంలో నేత‌లు పెద్ద ఎత్తున ఆస‌క్తి చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి భారీ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో..పీకే స‌త్తా ఓ రేంజ్‌కు చేరిపోయింది.

తాజాగా ఆయ‌న నిర్ణ‌యంతో ప్ర‌ముఖ సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం(MNM)పార్టీ అధినేత కమల్ హాసన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు సిద్ధ‌మ‌వుతున్న క‌మ‌ల్ త్వరలో టీవీ చానల్ స్థాపించబోతున్నారు. ఇటీవ‌ల పీకే సంప్రదింపులు జరుపుతున్న కమల్ హాసన్ ఆయన సూచనల ప్రకారమే టీవీ చానల్ ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది చివర్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మ‌రోవైపు న‌వంబర్ 7న కమల్ బర్త్ డే. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీని ప్రజల్లోకి తీస్కెళ్లేందుకు చానల్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు.తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ కోసం ఆయన చానల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

MNM పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయాలంటే టీవీ చానల్ తప్పనిసరని భావిస్తున్నారు. తన పుట్టిన రోజున ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు కమల్ హాసన్ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం పీకే స‌ల‌హాను ఆయ‌న ఫాలో అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

2018 ఫిబ్రవరి 21న కమల్  హాసన్  పార్టీని స్థాపించారు. మక్కల్  నీది మయ్యం పార్టీకి టార్చ్ లైట్  గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించింది. పార్టీకి గుర్తు కేటాయించడంతో కమల్ ట్విట్టర్లో ఈసీకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి తగిన గుర్తే లభించిందని ట్విట్ చేశారు. తమిళనాడు, దేశ రాజకీయ చరిత్రలో మక్కల్  నీది మయ్యం టార్చ్  బేరర్ గా మారబోతోందంటూ ట్విట్ చేశారు.

త్వ‌ర‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతానని కమల్ ఇప్పటికే ప్రకటించారు. అవినీతి పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులు కలపమని స్పష్టంచేశారు. డీఎంకేతో తెగదెంపులు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English