సాయిరెడ్డి రాంగ్ ట్వీటుతో అడ్డంగా బుక్కయ్యాడుగా...

సాయిరెడ్డి రాంగ్ ట్వీటుతో అడ్డంగా బుక్కయ్యాడుగా...

విజయసాయి రెడ్డి... వైసీపీ రాజ్యసభ సభ్యుడు..సీఎం జగన్ తర్వాత పార్టీలో నెంబర్2 గా ఉన్న నాయకుడు. టీడీపీని రోజు ట్విట్టర్ లో ఏకీపారేసే నేత. ఈయన రోజు సమయానికి భోజనం చేస్తారో లేదో తెలియదు గానీ రోజు తెలుగుదేశంపై విమర్శలు చేయకుండా మాత్రం ఉండరు. రోజుకి కనీసం రెండు ట్వీట్లు పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు, నాయకులపై విమర్శనాస్త్రాలు సంధిస్తారు.

అయితే రోజులానే సాయిరెడ్డి శుక్రవారం కూడా టీడీపీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఎప్పుడు ఖచ్చితమైన విమర్శలు చేసే సాయిరెడ్డి  శుక్రవారం ఓ మిస్టేక్ చేసి అడ్డంగా బుక్కయ్యారు. తాజాగా చంద్రబాబు గ్రామ వాలంటీర్లపై చేసిన విమర్శలని తిప్పికొడుతూ ట్వీట్ పెట్టారు. “గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ కోసం 4 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తే ప్రశంసించే పెద్ద మనసు లేదు గానీ, రిక్షాలు తొక్కాలని, హమాలీ పని చేయాలి అంటూ నిరుద్యోగులను బెదరగొట్టిన పాపం ఊరికే పోదని, ఈ ఐదేళ్లలో ఇంకా చాలా చూస్తారని, గుండె రాయి చేసుకొండి” అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

అయితే ఇదే ట్వీట్ సాయిరెడ్డిపై విమర్శలు వచ్చేలా చేస్తోంది. ఆయన చెప్పినట్లుగా అన్నీ పోస్టులని ప్రభుత్వం రిక్రూట్ చేయలేదు. కేవలం 2 లక్షలు మాత్రమే రిక్రూట్ చేశారు. సాయిరెడ్డి మాత్రం 4 లక్షలు అంటూ డప్పు కొట్టే ప్రయత్నం చేశారు. మొత్తానికి చంద్రబాబుకు కౌంటర్ ఇద్దామనుకుని విజయసాయిరెడ్డి రాంగ్ ట్వీట్ చేసి అడ్డంగా బుక్కైపోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English