టి.సెక్ర‌టేరియ‌ట్ కూల్చివేత‌కు స్కెచ్‌ రెడీ

టి.సెక్ర‌టేరియ‌ట్ కూల్చివేత‌కు స్కెచ్‌ రెడీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర సెక్ర‌టేరియ‌ట్‌ను కూల్చి కొత్త స‌చివాల‌యాన్ని నిర్మించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సెక్రటేరియట్ కూల్చివేతకు ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం.. శాఖలన్నింటినీ వాటికి తాత్కాలికంగా కేటాయించిన భవనాలకు తరలించింది.

వాటికి కేటాయించిన భవనాల్లో కోట్ల రూపాయల ఖర్చుతో ముస్తాబు చేశారు. ఉన్న సెక్రటేరియట్ కూల్చి.. కొత్త భవనాలు కట్టేవరకు అక్కడినుంచే పరిపాలన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే స‌మ‌యంలో..సెక్ర‌టేరియ‌ట్ కూల్చివేత‌కు ముంబై, చైనాలో స్కెచ్చులు వేస్తున్నారు.

బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచే అధికారిక కార్యక్రమాలు, పరిపాలన జరుగుతుండ‌టంతో...పాత స‌చివాల‌యంను కూల్చివేత‌కు వేగంగా స‌న్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్‌‌ చివరి కల్లా కూల్చివేత, చదును పనులు పూర్తి చేసి అదే నెలలో నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసే అవకాశముంది. దసరా తర్వాత నిర్మాణ పనులు మొదలుపెడతారని సమచారం. ఈ నేప‌థ్యంలో సెక్రటేరియెట్‌‌ను కూల్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

స‌చివాల‌యాన్ని ఇంప్లోజన్‌‌ పద్ధతిలో కూల్చడానికే సర్కారు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ముంబై, చైనా కంపెనీలతో చర్చిన్నట్టు తెలిసింది. సచివాలయంలోని జే, ఎల్‌‌ బ్లాక్‌‌లు మినహా మిగతావన్నీ ఐదంతస్తుల్లోపే ఉన్నందున ఈ పద్ధతిలో నిమిషాల్లో కూల్చేయొచ్చని, సమస్య రాదని ఆర్‌‌ అండ్‌‌ బీ అధికారులు భావిస్తున్నట్టు సమచారం.

ప్రతి బ్లాక్‌‌లోని పిల్లర్లకు జిలిటెన్ స్టిక్స్ అమర్చి బిల్డింగులను కూల్చనున్నారు. ఇంప్లోజన్‌‌ పద్ధతిలో 10 నుంచి 15 అంతస్తులున్న బిల్డింగును 15 నుంచి 30 నిమిషాల్లో కూల్చేయొచ్చు. అయితే పేలుడు దెబ్బకు శకాలాలు చెల్లాచెదురయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున దుమ్ము కూడా వెలువడుతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

మరి సెక్రటేరియట్ చుట్టూ లుంబిని పార్కు, హోటళ్లు, విద్యుత్ శాఖ, మింట్ కార్యాలయాలు, కమర్షియల్ కాంప్లెక్స్ ఉండటంతో కూల్చివేత టైంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందని చర్చ నడుస్తోంది. కాగా, ఆ ప్రకారం సెక్రటేరియెట్‌‌ కూల్చివేతకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఖర్చవనున్నట్టు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English