ఏపీలో మ‌రో తెలంగాణ వ్య‌క్తికి కీల‌క ప‌ద‌వి..!

ఏపీలో మ‌రో తెలంగాణ వ్య‌క్తికి కీల‌క ప‌ద‌వి..!

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల‌న‌లోనే కాదు ప‌లు నియామ‌కాల్లోనూ ఆస‌క్తిక‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తెలంగాణ వాసుల‌కు ప్ర‌భుత్వంలో పెద్ద‌పీట వేస్తున్నారు. ప‌లు కీల‌క స్థానాల్లో తెలంగాణ‌వాసుల‌ను నియ‌మిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురికి కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. తాజాగా మ‌రొక‌రికి కీల‌క స్థానం క‌ల్పించ‌బోతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మొన్న‌టి వ‌ర‌కు ఇటీవలి కాలం వరకు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా వ్యవహయంచిన కె. రామచంద్ర మూర్తిని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించనున్నట్లు ప్ర‌చారం జ‌ర‌గుతోంది.

జగన్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప‌లు విభాగాల్లో ప‌లువురు తెలంగాణ‌వాసుల‌కు కీల‌క స్థానం క‌ల్పించింది. సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్ (నల్లగొండ), కమ్యూనికేషన్స్ సలహాదారుగా కృష్ణమోహన్ (ఖమ్మం), జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్ (వరంగల్) నియమితులైన విషయం విదితమే. పీఆర్వో విభాగంలోనూ పలువురు తెలంగాణ వాసులకు అవకాశం లభించింది. తాజాగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా రామచంద్రమూర్తి (ఖమ్మం)కి జగన్ అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా తెలంగాణ వాసులకు ఏపీ ప్రభుత్వంలో సీఎం జగన్ కల్పిస్తున్న అవకాశాలు మీడియా వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.   అయితే.. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ ఏమిటంటే.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వీరికెందుకు ప్రాధాన్యం ఇస్తున్న‌ది. నిజానికి.. గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో వైసీపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉంది. ప్ర‌ధానంగా సాక్షి ప‌త్రిక‌, సాక్షి టీవీలో రామ‌చంద్ర‌మూర్తి, అమ‌ర్ త‌దిత‌ర తెలంగాణ‌వాసులు కీల‌క భూమిక పోషించారు.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వ త‌ప్పిదాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచ‌డంలో ఎప్ప‌టిక‌ప్పుడు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని, వైసీపీకి అనుకూలంగా క‌థ‌నాలు రూపొందించి, ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో అంత‌ర్గ‌తంగా వీరే కీల‌క పాత్ర పోషించార‌ని, అందుకే జ‌గ‌న్ వారిపై న‌మ్మ‌కం ఉంచి కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English