టీడీపీకి మరో అదిరిపోయే షాక్...

టీడీపీకి మరో అదిరిపోయే షాక్...

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరో కొన్ని రోజుల్లో కనుమరగవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గర నుంచి ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ లో చేరిపోయిన విషయం తెలిసిందే. అలాగే మరికొందరు కాంగ్రెస్  పార్టీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు అక్కడక్కడ తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలనీ బీజేపీ లాగేసుకుంటుంది.

ఇప్పటికే వందల సంఖ్యలో ఆ పార్టీ నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అటు బీజేపీ కూడా వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బలపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నేతలనీ ఆకర్షిస్తుంది.

ఈ ఆకర్షణలో భాగంగా టీడీపీ పార్టీ నేతలు జిల్లాలు జిల్లాలుగా బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి మరో పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి బీజేపీ జెండా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయ‌న పార్టీకి, చంద్ర‌బాబుకు అత్యంత విశ్వాస‌పాత్రుడు అన్న విష‌యం తెలిసిందే. రేవూరి ఇటీవల హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంత్రి అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నించారు.

అదే రోజు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ హఠాన్మరణంతో, షా హుటాహుటిన ఢిల్లీకి పయనమై వెళ్లిపోయారు. దీంతో షా-రేవూరి భేటీకీ వీలుకాలేదు. అయితే త్వరలోనే ఢిల్లీ వెళ్లి మరి అమిత్‌షాను కలిసి బీజేపీలో చేరే అవకాశం ఉంది. అసలే కష్టాల్లో ఉన్న టీడీపీని తెలంగాణ సీనియర్‌ నేతగా రేవూరి వీడటం పెద్ద దేబ్బే అని చెప్పొచ్చు.  కాగా, రేవూరి 1994, 1999, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

ఇక 2004, 2014 ఎన్నికల్లో నర్సంపేట నుంచి 2018 ఎన్నికల్లో వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ కూడా బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఆమె కూడా అమిత్ షాతో భేటీ అయ్యి కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English