ఎన్టీఆర్ ను కెలికి తప్పు చేశాడా?

ఎన్టీఆర్ ను కెలికి తప్పు చేశాడా?

రాజకీయాల్లో ఎప్పుడేం మాట్లాడాలన్నది చాలా కీలకం. ఒకే మాటను సందర్భానికి తగినట్లుగా మాట్లాడకుంటే అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. ఈ చిన్న సూత్రం తెలీకుంటే రాజకీయాల్లో ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడా వరుసలో చేరారు బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీగా అభ్యర్థిగా బరిలోకి దిగిన పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందన్న మాట నేతల ప్రైవేటు సంభాషణల్లోనూ.. క్యాడర్ లోనూ వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచనలంగా మారాయి.

టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదన్నారు. పార్టీలోకి వచ్చే ఉద్దేశం ఉంటే అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తనతో పాటు ఎవరికైనా పార్టీనే సుప్రీం అన్న భరత్ మాటలు.. అనవసరమైన వ్యాఖ్యలుగా చెప్పక తప్పదు.

సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనతో పాటు వచ్చిన 294 మంది జూనియర్ ఎన్టీఆర్ లానే అందరికి తెలిసిన వారు కాదని.. ఫలానా వ్యక్తి వస్తేనే పార్టీకి బలం అనటం సరికాదన్నారు. పార్టీకి జూనియర్ అవసరం లేదన్న ఆయన.. ఎన్టీఆర్ వస్తేనే పార్టీకి మంచిదన్న మాటను తాను ఒప్పుకోనని చెప్పేశారు.

పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఎంత?  ఆయన పార్టీలోకి వస్తే.. పగ్గాలు అప్పజెప్పాలన్న సోషల్ మీడియా చర్చను అక్కడితో వదిలేస్తే అయిపోయే దానికి.. భరత్ దాన్ని కెలికి వ్యాఖ్యలు చేయటం ద్వారా అనవసర ప్రాధాన్యం ఇవ్వటమే కాదు.. అవసరం లేని వేళలో మాట్లాడిన మాటలు.. అనవసరంగా పలువురి మనోభావాలు దెబ్బతినేలా చేయటం ఖాయం.

ఇపుడు భరత్ మాటలు బాబును ఇబ్బంది పెడుతున్నాయి. అసలే బయట బాబుకు - జూనియర్ కు పడదని ప్రచారం ఉంది. అట్లాంటి నేపథ్యంలో భరత్ వ్యాఖ్యలు బాబుకు ఒక తలనొప్పే. ఏ రోజూ చంద్రబాబు కుటుంబం ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా పరోక్షంగా కూడా వ్యాఖ్యలు చేయలేదు. ఇపుడు భరత్ వ్యాఖ్యలను బాబు ఎలా డీల్ చేస్తారో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English