బాలీవుడ్ అసూయతో రగిలిపోయేలా చేసిన ట్విట్టర్

బాలీవుడ్ అసూయతో రగిలిపోయేలా చేసిన ట్విట్టర్

తమకు మించిన మొనగాళ్లు లేరన్నట్లుగా వ్యవహరిస్తుంటుంది బాలీవుడ్. సౌత్ అంటే చిన్న చూపు ఎక్కువ కూడా. వాస్తవానికి నార్త్ తో పోలిస్తే సౌత్ లో టాలెంట్ ఎక్కువైనప్పటికీ.. ఏదోలా దాన్ని కవర్ చేసుకుంటూ సౌత్ ను చిన్నబుచ్చేలా చేస్తుంటారు.

బాలీవుడ్ తో పోలిస్తే సౌత్ సినిమాలు చెలరేగిపోతున్నాయి. ఆ మధ్యన వచ్చిన బహుబలిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది బాలీవుడ్. ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే వచ్చి కేజీఎఫ్ సినిమాతో బాలీవుడ్ కు మరో షాక్ తగిలింది. అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ కాసుల వర్షం కురిపించటం.. ఆగస్టు 30న విడుదలయ్యే సాహో చేస్తున్న సందడి బాలీవుడ్ లోని పలువురికి కంటగింపుగా మారిందన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. శనివారం హ్యాష్ ట్యాగ్ డే సందర్భంగా ట్విట్టర్ ఇండియా గడిచిన ఆర్నెల్లలోట్రెండ్ అయిన టాప్ ఐదు హ్యాష్ టాగ్ లను విడుదల చేసింది. ఈ జాబితాలో సౌత్ కు చెందిన రెండు సినిమాల హ్యాష్ టాగ్ లు ఉండగా.. బాలీవుడ్ కు చెందిన ఒక్క సినిమా హ్యాష్ టాగ్ లేకపోవటం చూసి అసూయతో రగిలిపోవటం ఖాయమని చెప్పక తప్పదు.

గడిచిన ఆర్నెల్లలో టాప్ ఫైవ్ హ్యాష్ టాగ్ లు చూస్తే.. మొదటి స్థానంలోఅజిత్ విశ్వాసం (#Viswasam) నిలవగా.. రెండో స్థానంలో లోక్ సభ ఎన్నికలు(#LokSabhaElections2019.. మూడో స్థానంలో క్రికెట్ వరల్డ్ కప్ 2019 (#CWC19) నిలిచాయి. నాలుగో స్థానంలో ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమాకు (#Maharshi) చోటు లభించటం విశేషం. ఐదో స్థానంలో న్యూ ప్రొఫైల్ పిక్ అనే హ్యాష్ టాగ్ కు చోటు లభించింది. ఇలా టాప్ ఫైవ్ లో రెండు సినిమాలు సౌత్ కు చెందినవి రాగా.. బాలీవుడ్ కు చెందిన హ్యాష్ టాగ్ ఒక్కటి కూడా లేకపోవటం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English