ఎన్టీఆర్‌కి టీడీపీ ప్లాన్ చేసి పంచ్ ఇచ్చిందా?

ఎన్టీఆర్‌కి టీడీపీ ప్లాన్ చేసి పంచ్ ఇచ్చిందా?

ఇటీవ‌లి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ప‌రాభ‌వం చవిచూసిన‌ప్ప‌టి నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి టీడీపీ టేక‌ప్ చేయాల‌న్న డిమాండ్లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. ఓవైపు చంద్ర‌బాబుకు వ‌య‌సు మీరుతుండ‌టం.. బాల‌య్య‌, లోకేష్ త‌దిత‌రుల సామ‌ర్థ్యంపై ఎవ‌రికీ న‌మ్మ‌కాలు లేక‌పోవ‌డంతో తార‌కే పార్టీకి దిక్కు అన్న అభిప్రాయాలు బ‌లప‌డుతున్నాయి.

తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు, నంద‌మూరి కుటుంబ అభిమానులు సైతం తార‌క్ ఆగ‌మ‌నం కోసం ఆశ‌గా చూస్తున్నారు. అత‌డి కోసం డిమాండ్లు వినిపిస్తున్నారు. ఐతే ఇది చంద్ర‌బాబు, బాల‌య్య‌ల‌కు రుచించ‌ద‌న్న‌ది స్ప‌ష్టం. మ‌రి పార్టీ త‌ర‌ఫున తార‌క్ కోసం డిమాండ్లు చేస్తున్న వారికి ఎలా చెక్ పెట్టాలి.. అత‌డికి రెడ్ కార్పెట్ ఇచ్చి ఆహ్వానించే ఉద్దేశాలు లేవ‌ని ఎలా చాటి చెప్పాలి? పార్టీ అగ్ర నాయ‌క‌త్వం పెద‌వి విప్ప‌కుండా ఈ చ‌ర్చ‌కు ఎలా తెర‌దించాలి?

ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే.. బాల‌య్య చిన్న‌ల్లుడు శ్రీ భ‌ర‌త్‌తో టీవీ ఇంట‌ర్వ్యూ అని తెలుస్తోంది. ఈ ఇంట‌ర్వ్యూ టీడీపీ ప్లాన్ చేసిందే అని తెలుస్తోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీ.. టీడీపీని అత‌ను టేక‌ప్ చేయ‌డం గురించి ఉద్దేశ‌పూర్వ‌కంగా ప్ర‌శ్న వేయించి భ‌ర‌త్‌తో పార్టీ వాయిస్ స్ప‌ష్టంగా చెప్పించే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ ఇంట‌ర్వ్యూ చేసిన జాఫ‌ర్ ఎప్పుడూ పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌ను వివాదాస్ప‌ద ప్ర‌శ్న‌లే వేస్తాడు.

ఆ ప్ర‌శ్న‌ల‌కు సిద్ధప‌డ్డ వాళ్లే ఇంట‌ర్వ్యూల‌కు వెళ్తారు. కాబ‌ట్టి ఎన్టీఆర్ గురించి ఎదుర‌య్యే ప్ర‌శ్న‌కు ఏం స‌మాధానం చెప్పాలో భ‌ర‌త్ బాగా ప్రిపేర‌య్యే రంగంలోకి దిగిన‌ట్లుంది. బ‌హుశా ఆ ప్ర‌శ్న అడ‌గ‌మ‌ని ముందే సంకేతాలిచ్చి ఉన్నా ఆశ్చర్యం లేదు. ఎన్టీఆర్ అవ‌స‌రం పార్టీకి లేద‌ని భ‌ర‌త్ అంత స్ప‌ష్టంగా చెప్పాడంటే అది య‌ధాలాపంగా అన్న‌ది కాదు. బాబు, బాల‌య్య‌ల ఉద్దేశాన్ని అంద‌రికీ చేర‌వేయ‌డ‌మే లక్ష్యంగా భ‌ర‌త్ ఈ వ్యాఖ్య‌లు చేశాడ‌ని.. త‌ద్వారా తార‌క్‌కు అంత ఈజీగా టీడీపీలో ఎంట్రీ ద‌క్క‌బోద‌ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English