సింధు ఎందుకు గ్రేట్ అంటే?

 సింధు ఎందుకు గ్రేట్ అంటే?

మ‌న సింధు సాధించింది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న‌ ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్ షిప్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని ఎట్ట‌కేల‌కు కొల్ల‌గొట్టింది. ఆదివారం స్విట్జ‌ర్లాండ్‌లోని బాసెల్‌లో ఏక‌ప‌క్షంగా సాగిన సెమీఫైన‌ల్లో ఆమె 21-7, 21-7తో జ‌పాన్ క్రీడాకారిణి న‌జోమి ఒక‌హుర‌ను చిత్తు చిత్తుగా ఓడించి ప‌సిడి ప‌త‌కాన్ని అందుకుంది. సింధు వ‌రుస‌గా మూడో ఏడాది ఈ ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీలో ఫైన‌ల్ చేర‌డం విశేషం.

2017లో తొలిసారి ఫైన‌ల్ ఆడ‌గా.. ఒక‌హుర‌నే ఆమె ఆశ‌ల‌కు గండి కొట్టింది. అప్పుడు విజయానికి అత్యంత చేరువ‌గా వ‌చ్చి త్రుటిలో మ్యాచ్‌ను కోల్పోయింది సింధు. ఈసారి ఒక‌హుర‌ను చిత్తు చిత్తుగా ఓడించి ఆ ప‌రాజ‌యానికి ఘ‌నంగా ప్ర‌తీకారం తీర్చుకుంది. ఒలింపిక్స్ ర‌జ‌తం స‌హా ఇప్ప‌టికే ఎన్నో ఘ‌న‌త‌లు సాధించిన సింధుకు కెరీర్లో ఇదే అతి పెద్ద విజ‌యం. ప్ర‌పంచ ఛాంపియ‌న్‌షిప్‌లో స్వ‌ర్ణం సాధించిన తొలి భార‌తీయురాలు ఆమే.

కేవ‌లం స్వ‌ర్ణం సాధించింది కాబ‌ట్టి సింధు గొప్ప‌దైపోదు. దీని వెనుక ఆమె ప‌డ్డ క‌ష్టం, ప‌ట్టుద‌ల ఆమె గొప్ప‌ద‌నాన్ని చాటుతాయి. రియో ఒలింపిక్స్‌లో ర‌జ‌తం గెలిచాక సింధుకు ఎంత పేరు ప్ర‌ఖ్యాతులు వ‌చ్చాయో తెలిసిందే. క్రికెట‌ర్ల‌కు దీటుగా ఆమె పాపులారిటీ సంపాదించింది. ఈ క్ర‌మంలో ప‌దుల కోట్ల‌లో ఆదాయం కూడా వ‌చ్చింది. ఎన్ని న‌జ‌రానాలు అందుకుందో? ఎన్ని స్పాన్స‌ర్‌షిప్‌లు వచ్చాయో.. లెక్కే లేదు. చూస్తుండ‌గానే ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్నురాలైన షట్ల‌ర్ అయింది. ఐతే ఈ ఫేమ్‌, ఈ డ‌బ్బు మాయ‌లో ప‌డి ఆమె ఆటను నిర్లక్ష్యం చేయ‌లేదు.
 
ఆట‌ను ఇంకా మెరుగు ప‌రుచుకుంది. ఒలింపిక్స్‌తో పాటు రెండు సార్లు ప్ర‌పంచ ఛాంపియ‌న్‌షిప్‌లో.. మ‌రికొన్ని టోర్నీల్లో ఆమె ఫైన‌ల్స్‌లో ఓడింది. దీంతో తుది మెట్టుపై బోల్తా కొట్టే బ‌ల‌హీన‌త గురించి విమ‌ర్శ‌లొచ్చాయి. అయినా వెర‌వ‌లేదు. క‌ష్ట‌ప‌డింది. ఎప్పుడూ నిరాశ చెంద‌లేదు. ఆట మీద ఫోక‌స్ కోల్పోలేదు. కాబ‌ట్టే ఈ రోజు ఈ గొప్ప విజ‌యం ఆమె సొంత‌మైంది. కాబ‌ట్టే సింధు గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేట్స్ అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English