ఏపీకి 4 రాజధానులంటూ టీజీ సంచలన వ్యాఖ్యలు

 ఏపీకి 4 రాజధానులంటూ టీజీ సంచలన వ్యాఖ్యలు

గడిచిన కొద్దికాలంగా కామ్ గా ఉంటున్న ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొత్త చర్చ మొదలైన వేళ.. ఇటీవల బీజేపీలో చేరిన టీజీ ఊహించని రీతిలో వ్యాఖ్యలు చేసి ఏపీ రాజధాని అంశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చారని చెప్పాలి.

ఒక ప్రముఖ ఛానల్ తో మాట్లాడిన ఆయన.. ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగకపోవచ్చన్నారు. ఇప్పటికే ఇదే విషయాన్ని బీజేపీ అధిష్ఠానంతో జగన్ చర్చలు జరిపారని.. తనకు ఆ విషయాన్ని బీజేపీ అధినాయకత్వమే చెప్పిందన్నారు.

టీజీ అంచనాల ప్రకారం ఏపీకి ఒకటి కాదు నాలుగు రాజధానులు ఉండనున్నాయి. విజయనగరం.. కాకినాడ.. గుంటూరు.. కడపలు ఏపీ రాజధానులుగా ఉండనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను చెప్పే మాటలు నూటికి నూరుశాతం నిజంగా అభివర్ణించారు.

పోలవరం టెండర్ల విషయంలో కేంద్రాన్ని సంప్రదించలేదన్న టీజీ.. ఈ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం చేస్తే.. చంద్రబాబుకు రాజకీయంగా లైఫ్ ఇచ్చినట్లేనని కీలక వ్యాఖ్య చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటున్న జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్య చేశారు టీజీ.

కేసీఆర్ ను జగన్ ఎంత తక్కువగా నమ్మితే అంత మంచిదన్నారు. టీజీ షురూ చేసిన ఏపీకి నాలుగు రాజధానులపై జగన్ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English