ఈటెల ఔట్‌...కేసీఆర్ కీల‌క ఆప‌రేష‌న్‌

ఈటెల ఔట్‌...కేసీఆర్ కీల‌క ఆప‌రేష‌న్‌

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత‌, ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త‌న మంత్రివ‌ర్గంలోని టీమ్‌లోని ఈటల రాజేందర్‌పై క‌న్నెర్ర చేశారా? ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డంలో భాగంగా కొత్త ఆప‌రేష‌న్‌కు తెర‌దీశారా? అంటే అవున‌నే సమాధానం వ‌స్తోంది.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్  ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెవెన్యూ చట్ట ప్రక్షాళనకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలను ఈటల రాజేందర్‌ ‌రెవెన్యూ అధికారులకు లీక్‌ ‌చేసిన‌ట్లుగా ప్ర‌భుత్వవ‌ర్గాలు భావిస్తుండ‌టం...ఈ మేర‌కు త‌మ అనుకూల మీడియాలో ఉద్దేశ‌పూర్వ‌క వార్త‌లు ఇవ్వ‌డం దీనికి కార‌ణంగా నిలుస్తోంది.

రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. దీంతోనే రెండ్రోజుల పాటు మంత్రులు, కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు. కొత్త రెవెన్యూ చట్టం తెచ్చేందుకు గానూ … రెవెన్యూ ప్రక్షాళనకు సంబంధించి తన మదిలో ఉన్న అభిప్రాయాలను, ఆలోచనలను సిఎం కేసీఆర్‌ ‌సహచర మంత్రులకు, జిల్లాల కలెక్టర్లకు సవివరంగా వివరించారు.

ఈ రెండ్రోజుల సమావేశాలలో రెవెన్యూ ప్రక్షాళన, కొత్త చట్టం, విధి విధానాలకు సంబంధించి ఖరారు చేసిన వివరాలను చట్టం రూపంలో బయటకు వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితులలోనూ బయటకు పొక్కనివ్వరాదనీ మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్‌ ‌తనదైనశైలిలో హుకూం జారీ చేశారు.

అయితే, ఈటల రాజేందర్‌ ‌రెవెన్యూ శాఖలోని కీసర ఆర్డీవో లచ్చిరెడ్డికి శామీర్‌పేటలోని తన ఫాంహౌజ్‌లో పూసగుచ్చినట్లు వివరించారనీ, ఈటల రాజేందర్‌ ‌లీకులతోనే రెవెన్యూ అసోసియేషన్‌ ‌ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన బాటకు సిద్ధమైనట్లు ప్రభుత్వాధినేత కేసీఆర్‌కు సమాచారం అందిందని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలను లీకులు చేయడంతో ప్రభుత్వం తలపెట్టిన ఆశయానికి తూట్లు పడేలా రాజేందర్‌ ‌వ్యవహారం ఉందన్న అభిప్రాయానికి ప్రభుత్వాధినేత కేసీఆర్‌ ‌వచ్చారనీ తెలుస్తుంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక వ్యూహాలను, ప్రణాళికలను ఈటెల రాజేందర్‌ ‌లీకులు చేయడం పట్ల సిఎం కేసీఆర్‌ ‌తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇందులో భాగంగా, తాను ఎంతో సీక్రెట్‌గా ఉంచాలనుకున్న రెవెన్యూ ప్రక్షాళన విషయాలను బయటకు చెప్పి రెవెన్యూ సంఘాలను చెప్పి ప్రభుత్వంపై ఎగదోయడానికి రాజేందర్‌ ‌ప్రయత్నించారనీ..ఇటువంటి వారి పట్ల కఠినంగా ఉండాలన్న ఆలోచనకు సీఎం కేసీఆర్‌ ‌వచ్చారనీ సమాచారం. చాలా నెలలుగా రాజేందర్‌ను వదులుకోవాలని చూస్తున్న కేసీఆర్‌కు…ఈ రెవెన్యూ రూపంలో వచ్చిన లీకులను ఆధారంగా చేసుకుని ఏ క్షణమైనా మంత్రి పదవీ నుంచి తప్పించినా తప్పించవ‌చ్చని అంటున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English