క్రికెటర్ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం

క్రికెటర్ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కెరీర్ ను చేజేతులారా నాశనం చేసుకున్న క్రికెటర్ గా శ్రీశాంత్ ను పలువురు అభివర్ణిస్తారు. తరచూ ఏదో అంశంపై వార్తల్లోకి వచ్చే ఆయనపై ఏకంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావటం.. ఆయనపై జీవితకాలం పాటు క్రికెట్ నుంచి నిషేధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఆయనపై విధించిన బ్యాన్ ను ఏడేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. అనూహ్య అంశంపై ఆయన వార్తల్లోకి వచ్చారు.

ఈ రోజున ఆయన ఇంట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున కొచ్చిలోని ఆయన నివాసంలో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం.. భారీగా మంటలు వ్యాపించటంతో కలకలం రేగింది.

తొలుత గ్రౌండ్ ఫ్లోర్ వ్యాపించిన మంటలు.. బెడ్రూం వరకూ వ్యాపించాయి. ఈ ఉదంతంలో బెడ్రూం పూర్తిగా తగలబడిపోయినట్లు చెబుతున్నారు.

ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో శ్రీశాంత్ ఇంట్లో లేరు కానీ ఆయన భార్య.. పిల్లలు మాత్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఫైర్ యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ డిపార్ట్ మెంట్ కు చెందిన అధికారులు హుటాహుటిన చేరుకున్నారు.

శ్రీశాంత్ భార్య.. పిల్లలు ఫస్ట్ ఫ్లోర్ లో చిక్కుకుపోవటంతో అద్దాలు పగలకొట్టి మరీ వారిని రక్షించారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English