మోడీ-షా టార్గెట్ లో జగన్ లేరా..!

మోడీ-షా టార్గెట్ లో జగన్ లేరా..!

ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లోభారీగా మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని రెండోసారి కేంద్రంలో పాగా వేసిన బీజేపీ... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో గెలవలేకపోయింది. మునుపెన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో, పశ్చిమ బెంగాల్లో విజయవంతమైన బీజేపీ తెలంగాణలో నాలుగు స్థానాలు గెలిచిన ఏపీలో మాత్రం చావుదెబ్బ తిన్నది. ఎన్నికల ముందు ఒక సంవత్సరం నుంచి తమకు ప్రత్యర్ధిగా మారిన చంద్రబాబుని దెబ్బకొట్టగలగడం బీజేపీకి కలిసొచ్చిన, జగన్ భారీ మెజారిటీతో గెలవడం మింగుడుపడని విషయం.

అటు తెలంగాణలో ముందు ఐదేళ్లు టీఆర్ఎస్ తో అనధికార మిత్రుత్వం చేసిన బీజేపీ...ఇప్పుడు నాలుగు స్థానాలు గెలవడంతో టీఆర్ఎస్ కు శత్రుపక్షంగా మారిపోయింది. అందుకే తెలంగాణపై మోడీ-షా ద్వయం ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ పార్టీ బలోపేతం అవ్వడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తూ ముందుకు వెళుతుంది. అయితే మోడీ-షా టార్గెట్ జగన్ కంటే కేసీఆర్‌నే ఎక్కువగా ఉన్నట్లు కనపడుతుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ కంటే కేసీఆర్ నే బీజేపీ పెద్ద శత్రువుగా చూస్తోంది. అందుకే ఆయన్ని టార్గెట్ చేసుకుని తెలంగాణలో రాజకీయంగా బలపడాలని చూస్తున్నారు. కేసీఆర్ వ్యూహాల్లో దిట్ట. ప్రజల్లో ఆయనకు మంచి బలం ఉంది. అవసరమైనప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయం చేయగలరు. అలాంటి కేసీఆర్ ని అదే విధంగా వీక్ చేయాలని బీజేపీ చూస్తోంది. అందుకే హిందూ మతం కార్డు వాడి రాజకీయం చేయడం మొదలుపెట్టింది.

తెలంగాణలో ముస్లిం జనాభా ఎక్కువగానే ఉంటారు. కాబట్టి మతం ఫీలింగ్ తీసుకురావడం బీజేపీకి సులువు. పైగా కేసీఆర్ కి వయసు కూడా మీదపడింది. తర్వాత కేటీఆర్ పార్టీని లీడ్ తీసుకుంటారు కానీ ఆయనకు ఎంతమంది మద్ధతు ఇస్తారో చెప్పలేం. అటు హరీష్ నివురుగప్పిన నిప్పులా ఉన్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ ని దెబ్బ కొట్టి రాజకీయంలో సక్సెస్ అవ్వడం బీజేపీకి సులువే.

కానీ తెలంగాణలో మాదిరి ఏపీలో వైసీపీని ఢీకొట్టడం బీజేపీకి సాధ్యం కానీ పని. జగన్ కు జనంలో మంచి బలం ఉంది. కుర్రవాడు. మరో మూడు దశాబ్దాల పాటు రాజకీయం చేయగల స‌త్తా కూడా ఉంది. దెబ్బలు తిన్న లేవగలడు.. ఇంకా చెప్పాలంటే అలానే లేచాడు. పైగా విభజన హామీల విషయంలో ఏపీ ప్రజలు బీజేపీ మీద గుర్రుగా ఉన్నారు. అందుకే ఎన్నికల్లో ఒక్క శాతం కూడా ఓట్లు రాలేదు.

ఇలాంటి తరుణంలో జగన్ ని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేయడం కంటే అతనితో సఖ్యతగా మెలిగి తమ డైరక్షన్ లో పని చేయించుకోవాలని చూస్తోంది. అలాగే బాబుని మళ్ళీ పైకి రానివ్వకుండా తోక్కేయాలి అంటే జగన్ మద్ధతు ఉండాల్సిందే. అందుకే మోడీ-షా ద్వయం తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలని జాగ్రత్తగా చూసుకుని ఏపీలో జగన్ ని టార్గెట్ చేయకుండా...తెలంగాణలో కేసీఆర్ మీద ఫోకస్ పెట్టింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English